టాలీవుడ్ లో నెక్స్ట్ సీజన్... స్టార్స్ మధ్య వార్ తప్పదేమో అనిపిస్తోంది. ఇప్పటికే కొందరు స్టార్ హీరోస్ సంక్రాతి బరిలో దూసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. మరికొందరు స్టార్ హీరోస్.. సమ్మర్ పై కన్నేసారు. వారి మూవీస్ తో హాట్ హాట్ సమ్మర్ ని కూల్ చేయాలనుకుంటున్నారు. టాలీవుడ్ లో బడా స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. ఫ్యాన్స్ లో హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొందరు స్టార్స్ ఉంటే.. మహేష్, రామ్ చరణ్, అల్లూ అర్జున్ లాంటి టాప్ స్టార్స్ సమ్మర్ ను టార్గెట్ చేస్తున్నారు.

Image result for allu arjun

సరైనోడుతో ఫుల్ మాస్ రూట్ ఎంచుకుని ఊర మాస్ అనిపించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా దువ్వాడ జగన్నాధంగా స్టైల్ మార్చాడు. కానీ.. టైమ్ బ్యాడ్. మూవీ ఓవరాల్ గా యావరేజ్ అనిపించుకుంది. సో ఇప్పుడు బన్నీ.. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా అన్న ట్రెండీ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ షురూ అవుతుండటంతో.. ఈ సరైనోడు వచ్చే సమ్మర్ లో సందడి చేయబోతున్నాడు.

Image result for ram charan

బన్నీతో పాటు బరిలో దిగడానికి సై అంటున్నాడు చెర్రీ.. ప్రజెంట్ రామ్ చరణ్ ‘‘రంగస్థలం 1985’’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా సమ్మర్ లో షో వేసేందుకు రెడీ అవుతుంది. యాక్చువల్ గా రంగస్థలం షూటింగ్ డిలే అవడం వల్ల చెర్రీ మూవీని సమ్మర్ కి షిప్ట్ చేశాడట.

Image result for mahesh

ఇలా బన్నీ చెర్రీల మూవీ ముహూర్తాలు సమ్మర్ లో పెట్టుకుంటుంటే.. సూపర్ స్టార్ మహేష్ కూడా అదే ముహూర్తానికి కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘‘భరత్ అను నేను’’. ఈ మూవీ మొదట సంక్రాంతికి అనుకున్నారు. కానీ.. భారీ అంచనాలతో రిలీజైన ‘స్పైడర్’.. షాక్ ఇవ్వడంతో మహి కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. భరత్ అను నేను షూటింగ్ డిలే అయినా డోన్ట్ వర్రీ అంటూ.. సమ్మర్ వెకేషన్ కి సై అంటున్నాడీ భరత్. 

Image result for summer movies

ఇప్పటికే రామ్ చరణ్ ‘‘రంగస్థలం 1985’’ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అల్లూ అర్జున్ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా కూడా మంచి బిజినెస్ చేయడం పక్కా అనిపిస్తుంది. ఇక పోతే.. మహేష్- కొరటాల కాంబోలో మూవీ అంటే ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. ఇలా ఒకేసారి ఈ ముగ్గురు బడా స్టార్స్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకొస్తే.. ఎలా ఉంటుంది? స్టార్ మధ్యే కాదు ఆడియన్స్ మధ్య కూడా వార్ స్టార్ట్ అవుతుందేమో కదా! టైటిల్స్ బట్టి ఈ బడా మూవీస్ మూడు.. డిఫెరెంట్ జోనర్స్ లో ఉంటాయని తెలుస్తుంది. బట్.. బక్సాఫీస్ మాత్రం భారీ వసూళ్లతో బద్దలవ్వటం ఖాయమనిపిస్తుంది. ఈ స్టార్ వార్స్ ను చూడాలంటే.. సమ్మర్ వరకూ కామ్ గా ఉండాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: