జయం కుర్రాడు ప్రేమలో పడ్డాడు.. అదేంటి ఆ సినిమాలో అప్పుడే సదాతో ప్రేమలో పడ్డాడు కదా చేస్తున్న ప్రతి సినిమాలో తన హీరోయిన్స్ తో ప్రేమలో పడుతూనే ఉన్నాడు కదా అంటే అది కేవలం రీల్ వరకే కాని నితిన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో ప్రేమలో ఉన్నాడట. అది కూడా తనతో లై సినిమా చేసిన తమిళ అమ్మాయి మేఘా ఆకాష్ తో మనోడు సెట్ అయ్యాడని టాక్.


లై నిరాశ పరచినా ఆ వెంటనే నితిన్ కృష్ణ చైతన్య నటిస్తున్న సినిమాలో కూడా మేఘా ఆకాష్ హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ఇద్దరి మధ్య లవ్ అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు. అయితే ఈ వార్తలపై స్పందించిన లై భామ మేఘా ఆకాష్. నితిన్ మంచి స్నేహితుడే కాని అతనితో ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదని అంటుంది మేఘా ఆకాష్. 


లై సినిమాతో కలిసి పనిచేశాం మరో సినిమాకు అవకాశం వచ్చింది చేస్తున్నా అంతే తప్ప మీరనుకుంటున్నట్టు ఏమి లేదు అనంటుంది అమ్మడు. టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే నచ్చిన అమ్మయి కోసం వెతుకుతున్నారట. 


మేఘాతో నితిన్ జోడి బాగుంది. ఇద్దరి మధ్య లవ్ నిజమే అయితే బాగానే ఉంటుంది. నాగ చైతన్య, సమంత స్పూర్తితో వీరిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నా అందరు ఓకే అంటారు. నితిన్ ఈ విషయంపై నోరు విప్పకున్నా మేఘా ఆకాష్ మాత్రం ప్రేమ దోమా ఏం లేదని అంటుంది. పైకి అలా అంటుందో లేక తన ఫీలింగే అదో త్వరలో తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: