తెలుగు ఇండస్ట్రీలో అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన యాంగ్రీమాన్ గా పేరు తెచ్చుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్.  తర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన రాజశేఖర్ ‘ఎవడైతే నాకేంటి’ చిత్రం తర్వాత సక్సెస్ లు లేవు. దీంతో ఆయనకు సినిమాలు కూడా తగ్గిపోయాయి. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న హీరో రాజశేఖర్ తాజాగా ‘గరుడ వేగ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మరో విజయం సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని మొదటి నుంచి అంటున్నాడు. 
Image result
వచ్చే నెల 3న ‘గరుడ వేగ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ, చిరంజీవిని ఇటీవలే కలిశానని, ‘గరుడ వేగ’ సినిమా చూసేందుకు ఆయన్ని ఆహ్వానించానని చెప్పారు.   ‘గరుడవేగ’ ట్రైలర్ చూశానని, బాగుందని చిరంజీవి ఈ సందర్భంగా ప్రశంసించారని, చిరు ఆఫీసులో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారని మెగాస్టార్ తనతో చెప్పిన విషయాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
Image result for 'PSV Garuda Vega' posters
ఇక మెగాస్టార్ మెచ్చుకున్నారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అన్నట్లే అంటున్నారు..అభిమానులు.  ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా కుమార్, శ్రద్ధాదాస్, సంజయ్ రెడ్డి తదితరులు నటించారు. బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనపడనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: