సినిమాలో ఆయన కనిపిస్తే ఏ డైలాగు చెప్పకుండానే మనకి నవ్వొస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు అయ్యి, విలన్ గా మరి చివరికి కమీడియన్ గా సెట్ అయిన ఆయనే పృథ్వీ రాజ్. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంటేనే అందరూ గుర్తు పడతారు ఆయన్ని. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ఆయన.

ఓసీ కులం లో పుట్టడం వల్లనే తనకి రావాల్సిన ఉద్యోగం రాలేదు అనీ తన బదులు వేరేవాడు డీఎప్సీ అయిపోయాడు అనీ అన్నారు ఆయన. ఒక వెబ్ మీడియా హౌస్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ నేను డీఎస్పీ అయి ఉంటే కనుక, నా మాటకారితనం, నాకు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలతో ఏ మంత్రి దగ్గరో చేరి భజన కనుక చేసి ఉంటే ఈపాటికి ఓ జిల్లాకు ఎస్పీ కూడా అయిపోయేవాడిని.

కానీ, నేను ఓసీ కావడంతోనే నాకు ఆరోజు ఉద్యోగం రాలేదు. ఉన్నత కులంలో పుట్టడం వల్లే ఉద్యోగాలు రాలేదని అనుకున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.కులం సంగతి పక్కన పెడితే మేము ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము. భవిష్యత్త్తు లో నేను ఎమ్మెల్యే అయితే ఈ ఓసీ కులం లో ఉన్న బడుగు వర్గాల గురించి మాట్లాడతాను " అన్నారు ఆయన.

"ఓసీల్లో రెడ్లు, రాజులు, చౌదరిలు, కాపు కులాల్లో ఒక లక్ష మందిలో పదివేల మంది బ్రహ్మాండంగా ఉన్నారు. ఇది వాస్తవం. బ్రహ్మాండమైన వ్యాపారాలు, తరతరాల ఆస్తులతో వాళ్లు చాలా బాగా ఉన్నారు. మరి, మిగిలిన తొంభై వేల మంది పరిస్థితి ఏంటీ? " అంటున్నారు పృధ్వీ.


మరింత సమాచారం తెలుసుకోండి: