తెలుగు బుల్లితెరపై రాణించి అదృష్టం కలిసి వచ్చి వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నవారు చాలా మంది ఉన్నారు. బుల్లితెరపై యాంకర్లుగా వచ్చిన వారు వెండితెరపై చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిస్తున్నారు.  ఇక జబర్ధస్ద్ కామెడీ షో లోని యాంకర్లు అనసూయ, రష్మి ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టివి, సినిమాల్లో బిజీ బిజీగా కాలం గడుపుతున్నారు. ఇక సినిమాల్లో తల్లిగా, అత్తగా నటిస్తున్న ప్రగతి ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను 'అక్కాచెల్లెళ్లు' సీరియల్ చేస్తుండగా 'సురేశ్ ప్రొడక్షన్స్' నుంచి కాల్ వచ్చింది.
Image result for sri vidya
తాము నిర్మించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి మదర్ గా నటించవలసి ఉంటుందని చెప్పారు.  వచ్చిన కాల్ 'సురేశ్ ప్రొడక్షన్స్' కానీ, నటించమంటుంది తల్లి క్యారెక్టర్ లో..అది కూడా ఇంచు మించు తన వయసు ఉన్న అమ్మాయితో..కాస్త ఇబ్బంది అనిపించి సరే అని అయిష్టాంగానే చెప్పాను.  ఇక  'అక్కాచెల్లెళ్లు' సీరియల్ నా తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్న  శ్రీ విద్య ఆ సమయంలో నా ఎదురుగానే వున్నారు.
Image result for pragathi
సురేశ్ ప్రొడక్షన్స్  నుంచి కాల్ వచ్చిందంటూ ఆమెకి విషయం చెప్పాను. అప్పుడు శ్రీ విద్య మేడమ్ ఇచ్చిన సలహాలు నా జీవితాన్నే మార్చాయి. నువు సినిమా ఇండస్ట్రీలో చాన్సుల కోసం ఎదురు చూసే సమయం..ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటే..అమ్మ . . అక్క .. వదిన .. ఎవరైతే ఏంటి?  నటించాలి. ఒకవేళ హీరోయిన్ గా రాణించాలనుకుంటే కాస్త టైమ్ పడుతుంది..ఒకవేళ రావొచ్చు..రాకపోవచ్చు. 
Image result for suresh production
తెలుగు ఇండస్ట్రీలో సురేశ్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ .. సినిమా ఎలా వున్నా నీకు మంచి పేరు వస్తుంది .. ఇప్పుడు ఫోన్ చేసి నువ్ ఆ పాత్ర చేస్తున్నట్టుగా చెప్పు" అంటూ పట్టుబట్టారు.  ఆమె ఇచ్చిన ప్రోత్సాహం..సలహాలు ఇప్పుడు ఈ స్టేజిలో నిలబెట్టాయి. నా కెరియర్ మలుపు తిరగడానికి ఆమెనే కారణం" అని చెప్పుకొచ్చారు.           



మరింత సమాచారం తెలుసుకోండి: