కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు మెహ్రీన్ కౌర్. ఆ సినిమాలో నాని సరసన నటించిన అమ్మడు ఆ తర్వాత శర్వానంద్ తో మహానుభావుడుతో హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా మాస్ మహరాజ్ రవితేజతో రాజా ది గ్రేట్ అంటూ హ్యాట్రిక్ హిట్ అందుకున్న అమ్మడు ప్రస్తుతం కేరాఫ్ సూర్య అనే డబ్బింగ్ సినిమాతో రాబోతున్నా డిసెంబర్ 1న సాయి ధరం తేజ్ జవాన్ లో నటించింది.


మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రచయిత దర్శకుడు బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెహ్రీన్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. చేసిన మొదటి 3 సినిమాల్లో అమ్మడు కాస్త పద్ధతిగా కనిపించగా ప్రస్తుతం జవాన్ లో అమ్మడి లోని హాట్ యాంగిల్ బయట పెట్టేసిందట. 


ఈమధ్యనే రిలీజ్ అయిన జవాన్ సినిమాలోని ఓ సాంగ్లో మెహ్రీన్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలుస్తుంది. అమ్మడి అందాలను డైరక్టర్ బాగా వాడేశాడని తెలుస్తుంది. హాట్ లుక్స్ తో కనిపిస్తే కాని ఆడియెన్స్ కూడా తమని గుర్తుంచుకోరని ఈ అమ్మడికి తెలిసింది కాబోలు హ్యాట్రిక్ హిట్లు కొట్టినా సరే ఈ జవాన్ లో అదిరే అందాలతో ఆకట్టుకుంటుంది.


ప్రస్తుతం ఫాంలో ఉన్న మెహ్రీన్ ఈ సినిమా కాస్త హిట్ అందుకుంది అంటే టాలీవుడ్ లో అమ్మడిది లక్కీ హ్యాండ్ అయినట్టే. ఈ క్రేజ్ తోనే విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్ పట్టేసిందట అమ్మడు. మరి సీనియర్ హీరోతో జతకట్టే ఛాన్స్ దక్కించుకున్న మెహ్రీన్ స్టార్ హీరోయిన్ గా ప్రమోట్ అయినట్టే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: