తెలుగు ఇండస్ట్రీలో రచయితగా ప్రస్థానం మొదలు పెట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంచలంచలుగా ఎదిగి..దర్శకత్వం రంగంలోకి అడుగు పెట్టారు.   అసిస్టెంట్ రైటర్‌గా పోసాని గారి దగ్గర పనిచేసి, స్వయంవరంతో కొంత పేరు సంపాదించాడు.  దర్శకత్వంలో సూపర్‌హిట్టయ్యాక, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వరకూ అప్రతిహతంగా హిట్లిచ్చి  రచయితగా ఎదిగాడు.   జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి , అ..ఆ వరకు అన్నీ సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించాడు. 

ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ అనగానే వెంటనే పవన్-త్రివిక్రమ్ ల పేరు గుర్తుకు వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే మంత్రం ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే టీవీల్లో ఆయన సినిమాలు ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగ్స్ వస్తాయి.

యాక్షన్ ... ఎమోషన్ ను కలిపిన వినోదాన్ని అందించడం ఆయన ప్రత్యేకత.   ఈ హిట్ కాంబినేషన్ మరోసారి  అభిమానుల ముందుకు రాబోతున్నారు.   ఈ రోజున త్రివిక్రమ్ పుట్టినరోజు .. పవన్ సినిమా సెట్స్ పై ఉండగా ఆయన పుట్టినరోజు రావడం విశేషం.

పవన్ కి ఇది 25వ సినిమా కావడం సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఈ రోజు త్రివిక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి సంబంధించిన స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: