వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌ర్వాత త‌న స్థాయికి త‌గిన హిట్ లేని సందీప్ కిష‌న్ ఇటీవ‌లే కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క్వంలో వ‌చ్చిన న‌క్ష‌త్రం సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన c/o సూర్య సినిమాలో న‌టించాడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు కోలీవుడ్ ద‌ర్శ‌కుడు సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు ఎలాంటి రిజ‌ల్ట్ వ‌చ్చిందో చూద్దాం.

Image result for c/o surya movie stills

ఈ సినిమా ఫ‌స్టాఫ్‌ను ద‌ర్శ‌కుడు సుసీంద్ర‌న్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కించాడు. క్రైం, స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూ, సందీప్ కిష‌న్ క్యారెక్ట‌ర్ బాగా డిజైన్ చేసుకుని క‌థ న‌డిపించాడు. సూర్య పాత్ర‌లో నేచుర‌ల్‌గా సందీప్ కిష‌న్ అలా ఒదిగిపోయాడు. స్క్రీన్ ప్లే ఆద్యంత ఆస‌క్తి రేప‌డంతో ఫ‌స్టాఫ్ చాలా డీసెంట్‌గా ఉంటుంది. 

Image result for c/o surya movie stills

ఇక కీల‌క‌మైన సెకండాఫ్‌లో ద‌ర్శ‌కుడు త‌డ‌బాటుకు గుర‌య్యాడు. కొన్ని కీల‌క సీన్ల‌లో ఫ‌స్టాఫ్ నుంచి కంటిన్యూ చేస్తూ వ‌చ్చిన గ్రిప్పింగ్ ట్రాక్ త‌ప్పాడు. విలన్ గ్యాంగ్ మరియు సందీప్ కిషన్ మధ్య మైండ్ గేమ్‌తో సాగే స‌న్నివేశాలు సూప‌ర్బ్‌. అయితే క్రైం బేస్డ్ స‌స్పెన్స్ మెయింటైన్ చేయ‌డంలో ద‌ర్శకుడు స‌క్సెస్ అయిన‌ట్టే లెక్క‌. 

Image result for c/o surya movie stills

ఇక సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కోసం బ‌ల‌వంతంగా ఇరికించిన సాంగ్స్‌, కామెడీ ఫెయిల్ అయ్యింది. ఓవ‌రాల్‌గా క్రైం + ఫ్యామిలీ బేస్ చేసుకున్న వ‌చ్చిన ఓ డీసెంట్ మూవీగా c/o సూర్య నిలుస్తుంది. అయితే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కాస్త భిన్నంగా ఉండే ఈ సినిమా సందీప్ కిష‌న్ కెరీర్‌లో డిఫ‌రెంట్ సినిమాగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: