యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆలోచనలను సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఈమధ్య పోస్ట్ చేసిన వీడియో మార్పును తీసుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ తో తన బాక్స్ ఆఫీస్ స్టామినాను చూపించిన విజయ్ దేవరకొండను ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ‘అర్జున్ రెడ్డి’ గా పిలుస్తున్న విషయం తెలిసిందే. అనుకోకుండా వచ్చిన ఈ అదృష్టాన్ని కొనసాగిస్తూ విజయ్ దేవరకొండ కూడ తన సినిమాల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.  

ఒకప్పుడు అవకాశాల కోసం అందరి చుట్టూ తిరిగిన ఈహీరో ఇప్పుడు చాల మంది దర్శకులకు అవకాశాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం చాల బిజీగా ఉన్న ఈ యంగ్ హీరోకి సడన్ గా ఒక జ్ఞానోదయం అయ్యిందట. దీనికి కారణం మహేష్ బాబు సోదరి మంజుల అని అంటున్నాడు. ఆమె ఈమధ్య తన పుట్టినరోజు సందర్భంగా ‘ఫాలో యువర్ హార్ట్'  అనే షో రీల్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ వీడియోను చూసిన ప్రముఖులు చాలా మంది మంజులను చాలా ప్రశంసించారు. అంతేకాదు ఆమె తెలియజేసిన జీవిత సత్యాలకు ఫిదా అయిపోయారు. తను చెప్పింది కరెక్ట్ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం మంజుల మాటలను మాత్రం ఆచరణలో పెట్టి చూపించాడు. 

మంజుల చెప్పినట్లుగా ‘మనసుకు నచ్చింది చెయ్యి’ అనే పాయింట్ తీసుకొని తన మనసుకు నచ్చిన పని చేశాడు. ఘాటింగ్ క్యాన్సిల్ అని చెబుతూ ‘హార్ట్ చెప్పింది హాయిగా నిద్రపొమ్మని’ అంటూ సోషల్ మీడియా లో కామెంట్ పెట్టి తను నిద్రపోవడానికి రెడీగా ఉన్నట్లు ఒక ఫొటో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే షూటింగ్ క్యాన్సిల్ అంటే లక్షలలో నిర్మాతకు నష్టం కాబట్టి మంజుల మాటలు విని విజయ్ దేవరకొండ ఏ నిర్మాతకు నష్టం కలిగించాడు అంటూ విజయ్ దేవరకొండ పై సెటైర్లు పడుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: