నిన్న సాయంత్రం ప్రకటించిన ‘నంది’ అవార్డుల ఎంపిక ప్రకటన విడుదలై కనీసం 24 గంటలు కూడ పూర్తికాకుండానే ఈఅవార్డుల ఎంపిక పై విమర్శలు మొదలు అయ్యాయి. ఒక జాతరను తలపిస్తూ ఒకేసారి మూడు సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులు ప్రకటించడంతో ఇంచుమించు టాలీవుడ్ ప్రముఖ నటుల కుటుంబాలకు చెందిన చాలామందికి ఎదో ఒక అవార్డుతో సద్దుబాటు చేసినట్లుగా ఈఅవార్డుల లిస్టు పై కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు సినిమా రంగానికి సంబంధించి దాదాపు 70 సంవత్సరాలు నటించి చనిపోయే వరకు నటిస్తూ తెలుగు సినిమా రంగాన్ని శాసించిన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ కు నంది అవార్డులకు సంబంధించి అవమానం జరిగింది అంటూ తీవ్రవిమర్శలు వస్తున్నాయి. 'చివరి శ్వాస విడిచేవరకూ నటిస్తూనే వుంటా' అంటూ అక్కినేని చెప్పినట్లుగా తనకు తీవ్రఅనారోగ్యం చేసినప్పుడు కూడ ఈసినిమాలో నటించి మెప్పించారు అక్కినేని.

‘అక్కినేని లివ్స్‌ ఆన్‌’ అంటూ అక్కినేని చనిపోయిన తరువాత విడుదలైన ఈసినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడ పొందింది. అక్కినేని నాగేశ్వరావు ఇప్పటికీ జీవించి ఉన్నారు అనేవిధంగా ఈసినిమా చూసిన అక్కినేని అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకుడు కూడ ఫీల్ అయ్యాడు. దీనికితోడు పూర్తి కొత్తదనంతో కూడుకున్న సినిమా కథ ‘మనం’.  స్క్రీన్‌ప్లే పరంగా ఎలా చూసినా 'మనం' ది బెస్ట్‌ సినిమాగా చెప్పవచ్చు. 

‘నంది’ అవార్డుల్లో ప్రధమ స్థానం దక్కించుకున్న 'లెజెండ్‌' సినిమాతో పోలిస్తే 'లెజెండ్‌' ముందు అన్ని విధాల 'మనం' ప్రధమ స్థానంలో ఉన్నా ఆ సినిమా ఎందుకు ఓడిపోయింది అన్న చర్చలు జరుగుతున్నాయి. కనీసం ఆసినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వకుండా ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వడం నాగచైతన్యకు సహాయనటుడు కేటగిరీలో అవార్డు ఇవ్వడం విషయాలను అక్కినేని నాగార్జున అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ‘మనం’ సినిమాకు అవమానం జరిగింది అంటూ కొందరు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: