తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గొప్ప హీరోలు తమ హవాకొనసాగిస్తున్న సమయంలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదట విలన్ గా నటించి తర్వాత హీరోగా మారి ఇండస్ట్రీలో తనకు ఎదురే లేదు అనిపించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.  ప్రస్తుతం మెగాస్టార్ వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.  శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి ఈ సంవత్సరం వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 
Image result for sai ra narasimha reddy
పది సంవత్సరాల క్రితం చిరంజీవి ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు బ్రహ్మరథం పట్టారు.  ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు.  ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళుతుందని భావిస్తుండగా, ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దిగ్గజ నటులు , టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగం కాబోతుండడంతో సైరా సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 
Image result for sai ra narasimha reddy
ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు..అయితే ఇంత గొప్ప చారిత్రాత్మక చిత్రం మనోడు హ్యండిల్ చేస్తాడా అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయించారట.  సైరా నరసింహరెడ్డి పాత్రలో తాను ఎలా ఉంటానని తెలుసుకోవడానికి చిరు కూడా ఫుల్ కాస్ట్యూమ్ ధరించి టెస్ట్ షూట్ లో పాల్గొన్నాడట.
Image result for sai ra narasimha reddy
ట్విస్ట్ ఏంటంటే..తన కెరీర్ లో టెస్ట్ షూట్ లో పాల్గొనడం చిరుకి ఇదే మొదటి సారి అట.  ఇక సినిమా విషయానికి వస్తే.. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మించనున్నారు.   ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి సైరాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: