పవర్ స్టార్ గా ‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడినా అది మీడియాకు ప్రస్తుతం  మీడియాకు హాట్ టాపిక్. ముఖ్యంగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పవన్ కామెంట్స్ పై చేసే హడావిడి మాటలకు అందనిది. అయితే పవన్ అనేక సామాజిక విషయాల పై చేసే కామెంట్స్ ఆలోచింప చేసేవిగా ఉంటాయి కాబట్టి వాటిపై చర్చలు జరగడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థుతులలో టాప్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను కలిగిన పవన్ లేటెస్ట్ గా   హీరో అనే పదానికి నిర్వచనం చెబుతూ మై ఎవ్రీడేహీరో అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 
 పవన్ ఈ విషయాలు పట్టించుకో
పవన్ కు బాగా నచ్చిన హీరో హకీం అతడి పేరును ప్రస్తావిస్తూ అతడి  ఫొటోను పోస్ట్ చేశాడు పవన్. ఇంతకీ ఆ హకీం ఇండియన్ కాడు లండన్ లో ఉంటున్న బంగ్లాదేశ్ దేశస్థుడు. అతడు ఏన్నో ఏళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ లో స్థిరపడిన వ్యక్తి అట. తాను ప్రతీసారి లండన్‌ కు వెళ్లినపుడు ప్రత్యేక విమానంలో తనను తిప్పుతాడని పవన్ చెపుతున్నాడు. 
 పవన్‌కు ఘన స్వాగతం
ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిత్వంగల వాళ్ళు మాత్రమే హీరోలుగా పరిగణింపబడతారు  అని చెపుతున్న పవన్ ఆ లక్షణాలు అన్నీ హకీంలో ఉన్నాయి జీవితంలో ఎన్నో సమస్యల్లో ఉండి కూడా ఇతరులను మంచి మార్గంలో నడిపించే వ్యక్తులు అంటే తనకు ఇష్టం అని పవన్ చెపుతున్నాడు. ఇటీవల తాను లండన్‌ కు వెళ్ళినప్పుడు హకీం తనకు ఇచ్చిన సలహాలను బయటపెట్టాడు పవన్. మహిళల భద్రత, గృహ హింససీనియర్ సిటిజన్లను గురించి ఆలోచించినప్పుడే తాను రాజకీయ వేత్తగా బాగా రాణిస్తానని హకీం చెప్పాడని పవన్ చెపుతున్నాడు.  
 జనసేన జెండాల రెపరెపలు
గాంధీ గురించి హకీం చెప్పిన ఓ విషయం తనను కదిలించింది అని పవన్ అంటూ ఏ మతమైనా హింసను ప్రోత్సహించ కూడదని హకీం చెప్పే మాటలు తనకు ఎంతో ఇష్టం అని అంటున్నాడు ఈ జనసేనాధిపతి. కోట్లాదిమంది అభిమానులు గల పవన్ తన రియల్ హీరో గురించి సంబంధించిన విషయాలు ఇప్పుడు బయట పెట్టడంతో పవన్ తో పాటు హకీం కూడ మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: