నారా రోహిత్ , పృధ్వి కామెడీ , ప్రొడక్షన్ వాల్యూస్నారా రోహిత్ , పృధ్వి కామెడీ , ప్రొడక్షన్ వాల్యూస్రొటీన్ కథ, కథనం, సెకండ్ హాఫ్ ల్యాగ్
భానుమతిదేవి (రమ్యకృష్ణ), ప్రతాప్ రెడ్డి (అజయ్) ల మధ్య వివాదం ఉంటుంది. అయితే భానుమతిదేవి మేనకోడలు ఆద్య (రెజినా)ను చంపేసి భానుమతిదేవి మీద పగ తీర్చుకోవాలని చూస్తాడు ప్రతాప్ రెడ్డి. అయితే ఆద్యకు తెలియకుండానే తనకు రక్షణగా బాలు (నారా రోహిత్)ను పెడుతుంది. ఇక ఆద్యకు ఎలాంటి ఆపద రానివ్వకుండా చూస్తున్న బాలుకి అనుకోకుండా సమస్య ఎదురవుతుంది. అయితే ఆ సమస్య నుండి బాలు ఎలా బయట పడ్డాడు..? ప్రతాప్ రెడ్డి నుండి ఆద్యను ఎలా కాపాడాడు అన్నది అసలు కథ.

నారా రోహిత్ కెరియర్ లో మొదటిసారి ఓ పక్కా కమర్షియల్ సినిమా చేశాడని చెప్పాలి. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన నారా రోహిత్ బాలకృష్ణుడులో స్లిం లుక్ లో అలరించాడు. ఇక బాలు పాత్ర తనకు పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆద్యగా రెజినా అందాలతో యూత్ ఆడియెన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. ఇక రమ్యకృష్ణ పాత్ర ఉన్నంతవరకు బాగుంది. అజయ్ కూడా తన రెగ్యులర్ పాత్రే కాబట్టి బాగానే చేశాడు. 30 ఇయర్ పృధ్వి కామెడీ బాగుంది. శ్రీనివాస్ రెడ్డి కూడా అలరించాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

పవన్ మల్లెల డైరక్షన్ టాలెంట్ ఓకే కాని ఈ సినిమా కథ కథనాలు అన్ని పరమ రొటీన్ గా ఉంటాయి. ఆ విషయంలో దర్శకుడు ఎందుకు రొటీన్ గా నడిపించాడో అర్ధం కాదు. విజయ్ సి కుమార్ కెమెరా పనితనం బాగుంది. మణిశర్మ మ్యూజిక్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశారు.
నారా రోహిత్ సినిమా అనగానే అందులో కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని అనుకుంటాం అయితే బాలకృష్ణుడు విషయంలో మాత్రం అది కుదరలేదు. పవన్ మల్లెల రొటీన్ సబ్జెక్ట్ తో ఈ సినిమా చేశాడు. ఇది పక్కా రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇన్ని సినిమాల తర్వాత నారా రోహిత్ ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది.

తన శత్రువులు మేనకోడలిని చంపుతారని తెలిసి ఓ రక్షకుడిని పెట్టడం అతను చొరవ తీసుకుని ఆమెతో ప్రేమలో పడటం ఇవి ఎప్పుడో వచ్చిన కథలు. అయితే పాత కథే అయినా దర్శకుడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగించాడు. అయితే పృధ్వి కామెడీ మాత్రం బాగుంది. సినిమాను కమర్షియల్ బాట పట్టించడంలో కామెడీ ప్లస్ అయ్యింది.

ఇక కథ కథనాల విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. యూత్ ఆడియెన్స్ రెజినా అందాల కోసం చూడొచ్చేమో కాని బాలకృష్ణుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమా. మరి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Nara Rohit,Regina Cassandra,Pavan Mallela,B Mahendra Babu,Nandamuri Sri Vinod,Musunuru Vamsi Krishna,Mani Sharmaబాలకృష్ణుడుతో కమర్షియల్ బాట పట్టిన నారా రోహిత్!

మరింత సమాచారం తెలుసుకోండి: