ప్రస్తుతం పరాజయాల బాటలో పయనిస్తున్న హీరో సునీల్ కొత్త సినిమా ‘2 కంట్రీస్‌’ సినిమా టీజర్ ‎ని నిన్న సాయంత్రం పవన్ లాంచ్ చేసాడు. ఈ సినిమా సెట్ లో జరిగిన ఈకార్యక్రమానికి పవన్ వ్యక్తిగతంగా రావడమే కాకుండా ‘2 కంట్రీస్‌’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ‎గా ఉందని కామెంట్స్ చేసాడు. పవన్ కూడ ఇలా సునీల్ సినిమా కోసం తోడవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలలో ఆనందంతో పాటు సామాన్యంగా బయటకు ఫంక్షన్స్ కు రాని పవన్ సునీల్ కోసం రావడం వెనుక త్రివిక్రమ్ కారణమా అంటూ చర్చలు జరిగాయి.

అయితే ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్న ఎన్. శంకర్ కు పవన్ కు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం రీత్యా ఈమూవీ టీజర్ లాంచ్ కు వచ్చినట్లు చెపుతున్నారు. దీనికితోడు గతంలో పవన్ సునీల్ తో కలిసి అనేక సినిమాలలో నటించిన నేపధ్యంలో వారిద్దరి స్నేహం కూడ పవన్ ను ‘2 కంట్రీస్’ టీజర్ లాంచ్ ఫంక్షన్ కు వచ్చేలా చేసిందని సమాచారం. 

నిన్న విడుదలైన ఈమూవీ టీజర్ సునీల్ ఇప్పటి వరకు నటించిన రొటీన్ కామెడీ సినిమాల మాదిరిగా కాకుండా మైండ్ బ్లోయింగ్ గా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మలయాళ చిత్రం '2కంట్రీస్' రీమేక్ గా నిర్మింపబడుతున్న ఈసినిమాకు అదే టైటిల్ ను కొనసాగిస్తున్నారు. 

ఈసినిమాలో సునీల్ ఎప్పటిలాగానే కామెడీ పండించే పాత్రనే చేశాడు కాని ఈసారి కామెడీ మాత్రం చాల అదిరిపోయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈమూవీకి శ్రీధర్ సీపాన డైలాగ్స్ బాగానే పేలుతాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సునీల్ ప్రక్కనే నటించిన మలయాళ ముద్దుగుమ్మ మనీషా రాజ్ గ్లామర్ కూడ ఈసినిమాకు కలిసిరావడంతో పాటు పవన్ హస్తవాసి కూడ కలిసి వస్తే ఈమూవీతో తిరిగి సునీల్ ట్రాక్ లోకి రావడం ఖాయం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: