మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ లో స్పష్టమైన తెలుగు నుడికారం వినిపిస్తుంది. ఇంగ్లీష్ పదాల జోలికి వెళ్ళకుండా ఎక్కువగా తన సినిమాలకు తెలుగు పదాల టైటిల్స్ ను ఫిక్స్ చేయడం త్రివిక్రమ్ అలవాటు. ఇప్పుడు ఆ వ్యవహార శైలినే అనుసరిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. వరస విజయాలతో దూసుకుపోతున్న నాని నిర్మాతగా మారి నిర్మించిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేయడమే కాకుండా ఆసినిమా టైటిల్ విషయంలో కూడ అందరికీ షాక్ ఇచ్చాడు నాని.


 ప్రశాంత్ వర్మ డైరక్షన్లో రూపొందిన ఈసినిమాకు ‘అ’ అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. ఈ సినిమాను నాని సమర్పిస్తూ ఉండగా ‘బాహుబలి’ సినిమాకు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ప్రశాంతి త్రిపిర్నేని ఈసినిమాను నిర్మిస్తోంది.  ఈసినిమా ఫస్ట్ లుక్ లో టైటిల్ ను ‘అ’ అని ఉన్నట్లుగా డిజైన్ చేసి విడుదల చేసారు.


ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అని చెపుతూ  పక్కనే ఉన్న భగవద్గీత క్రిందే పేపర్లో చుట్టేసిన ఒక గన్ ఆ క్రిందనే ఆర్గాన్ డొనేషన్ అవయవ దానం కోసం సైన్ చేసే నో-అబ్జెక్షన్ ఫామ్ ను చూస్తుంటే ఇదేదో డిఫరెంట్ క్రయిమ్ థ్రిల్లర్ అని అర్దమవుతోంది. అవయవ దానం చుట్టూ తిరిగే చాలా కధలు ఇప్పటి వరకు వచ్చినా ఒక లవ్ స్టోరీ నేపధ్యంలో నడిచే క్రైం థ్రిల్లర్ గా ఈమూవీ ఉంటుందని తెలుస్తోంది.


మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసినిమాలో నిత్యామీనన్ అవసరాల శ్రీనివాస్ రెజీనా ప్రియదర్శి ఈషా కాజల్ అగర్వాల్ లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. ఈసినిమాకు నానితో పాటు రవితేజ కూడ వాయిస్ ఓవర్ ఇచ్చిన నేపధ్యంలో నాని నిర్మాతగా చేస్తున్న ఈ ప్రయత్నం భారీ సక్సస్ ను ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: