కొన్ని సినిమాలు నెగెటివ్ టాక్ తోనే అద్భుత వసూళ్లు లాగేస్తాయి. క్రిటిక్ లు వరస్ట్ గా ఉంది అని రాసుకొచ్చినా ..  ఏది ఎలా ఉన్నా సినిమా పరంగా రెవెన్యూ పరంగా భారీ హిట్ చేజిక్కించుకునే సినిమాలు అనేకం ఉన్నాయి.



దీనికి సరైన ఉదాహరణ రాజుగారి గది పార్ట్ 1 , దువ్వాడ జగన్నాథం , సరైనోడు సినిమాలు తీసుకోవచ్చు. కానీ కొన్ని సినిమాలు సూపర్ టాక్ తో బయటకి వచ్చినా సరైన వసూళ్లు లేక చతికిల పడతాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉన్నది ఒకటి జిందగీ .



కాస్త స్లో నారేషన్ ఉన్నా కూడా ఉన్నది ఒకటే జిందగీ సినిమా మంచి ఫీల్ గుడ్ చిత్రం గా అందరూ అనుకున్నారు. మొదటి రోజు నుంచీ మూడు రోజుల వరకూ టాక్ అదిరిపోయింది.



ఫిదా లాగా పెద్ద హిట్ అయిపోతుంది అని లెక్కలు వేసారు. మూడు రోజుల తరవాత సినిమా టాక్ బాగానే నడిచినా 11 కోట్ల షేర్ ని వీకెండ్ లో లాగింది కానీ ఆఖరికి 17 కోట్ల దగ్గర చతికిల పడిపోయింది ఈ చిత్రం ఇప్పుడు నష్టం లో థియేటర్ ల లోంచి బయటకి వెళ్ళింది. 22 కోట్ల బిజినెస్ జరగగా ఐదు కోట్ల నష్టం తో ప్లాప్ గా మిగిలిపోయింది ఈ చిత్రం. రామ్ కి స్టార్ స్టామినా , క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ సరిగ్గా లేదు అని మరొక్కసారి రుజువు అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: