అఖిల్ ‘హలో’ మూవీ వచ్చేనెలలో రిలీజ్ కు రెడీ అవుతున్న నేపధ్యంలో ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి ఊపు అందుకుంది. ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా నాగార్జున ఈసినిమా కొనుక్కోవడానికి ఇష్టపడుతున్న బయ్యర్లతోను అదేవిధంగా ఈసినిమా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కు సంబంధించి కొన్ని కార్పొరేట్ కంపెనీలతోను నాగార్జున వ్యాపార చర్చలు జరుగుతున్నట్లు టాక్. 

అయితే ‘హలో’ సినిమాకు సంబంధించి నాగార్జున చెపుతున్న రేట్లు జూనియర్ రామ్ చరణ్ ల సినిమాల రేంజ్ లో ఉండటంతో ఈసినిమాను కొనుక్కోవడానికి ఆసక్తి కనపరుస్తున్న వ్యాపార వర్గాలు షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షాక్ అయిన కార్పరేట్ వర్గాలు ఇంత భారీ స్థాయిలో ఎందుకు ‘హలో’ సినిమాకు సంబంధించిన రేట్లను చెపుతున్నారో అర్ధం కాక తల పట్టుకుంటున్నట్లు టాక్.

దీనికితోడు అఖిల్ మొట్టమొదటి సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారిన విషయాన్ని నాగార్జున మరిచిపోయాడా అని కూడ కార్పరేట్ వర్గాలు తమలో తాము కామెంట్స్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘హలో’ సినిమాకు సంబంధించి శాటిలైట్ డిజిటల్ రైట్స్ బిజినెస్ తో పాటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ఏరియాల బిజినెస్ కూడ ‘హలో’ కు సంబంధించి పూర్తి కాలేదు అని తెలుస్తోంది. 

దీనితో నాగార్జున ‘హలో’ పై బిజినెస్ పరంగా భారీ అంచనాలు పెట్టుకున్నట్లు అర్ధం అవుతోంది. అయితే ఎటువంటి పెద్ద పండుగలు లేని డిసెంబర్ నెలలో ‘హలో’ విడుదల అవుతున్న నేపధ్యంలో కేవలం అఖిల్ క్రేజ్ తో ఈమూవీకి ఎంత వరకు భారీ కలక్షన్స్ వస్తాయి అన్న అనుమానాలు కార్పరేట్ వర్గాలను వెంటాడుతున్నట్లు టాక్. అయితే దర్శకుడు విక్రమ్ కుమార్ చేసే మ్యాజిక్ తో ‘హలో’ కు భారీ విజయం వస్తుంది అని నాగార్జున చెపుతున్న మాటలు ఎంత వరకు నిజం అవుతాయో డిసెంబర్ 22న తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: