మలయాళ ‘ప్రేమమ్’ తో మలయాళ సినిమారంగంలో సంచలనాలు సృష్టించిన క్రేజీ యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసి తెలుగు సినిమా రంగంలో తన అభిమానులకు మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నించింది. తాను షూటింగ్ లకు బయట ఊరు వెళ్ళినప్పుడు తనగురించి తన పెంపుడు కుక్క ‘విస్కీ’ ఎప్పుడూ తనగురించి ఎదురు చూస్తూ ఉంటుందని చెపుతూ తనకు తనపెంపుడు కుక్క విస్కీ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది.

ఇదేసందర్భంలో తన ఇష్టాల గురించి చెపుతూ తాను జిమ్ కు వెళ్ళను అనీ చక్కటి పోషక ఆహారం తినడంద్వారా తన శరీరాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటున్న విషయాన్ని బయటపెట్టింది అనుపమ. అదేవిధంగా తనకు సోషల్ మీడియా పట్ల పెద్దగా ఆసక్తి లేదని అందువల్ల సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉండే పద్దతిని పెద్దగా తాను అలవాటు చేసుకోలేదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. 

అదేవిధంగా ఫ్యాషన్ విషయంలో తాను చాల పూర్ అని చెపుతూ రోజురోజుకు మారిపోతున్న ఫ్యాషన్ టెక్నిక్స్ తనకు పెద్దగా తెలియదు అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. ఇక తెలుగులో తాను ఇప్పటి వరకు నటించిన హీరోల మనస్తత్వం పై అనుపమ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

హీరో రామ్ కేవలం తన నటనకు సంబంధించిన సీన్స్ ను మాత్రమే పట్టించుకోకుండా తాను లేని సీన్స్ కూడ ఎలా వస్తున్నాయో పరిశీలిస్తూ ఉంటాడని అంటూ రామ్ కు టీమ్ స్పిరిట్ ఎక్కువ అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఇక తన బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్ గురించి మాట్లాడుతూ అతడిని తన కుటుంబ సభ్యుడులానే ఫీల్ అవుతాను అని అంటూ కళ్ళతో శర్వానంద్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చాల అద్భుతం అని అంటోంది. ఇక నాగచైతన్య చాల ప్రొఫెషనల్ గా ఉంటాడు అని అంటూ మొదట్లో తన మొదటి హీరో నితిన్ తో చేయడానికి తాను చాల భయపడిన విషయాన్ని బయటపెట్టింది. ఇప్పటి వరకు ఈమె తెలుగు మలయాళం తమిళంలో నటించిన సినిమాలు కేవలం ఎనిమిది మాత్రమే అయినా క్రేజ్ లో మాత్రం ఈమె రేంజ్ టాప్ హీరోయిన్స్ స్థాయిలో దూసుకుపోతూ ఉండటం యూత్ లో ఈమెకు ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: