టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమై చిత్రాల్లో నటించి మాస్ ఇమేజ్ సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి వెళ్లారు.   దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  గతంలో ఠాగూర్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.  అప్పటి వరకు చిరంజీవి పై రక రకాల రూమర్లు వచ్చాయి..పది సంవత్సరాల తర్వాత ఆయన స్టామినా తగ్గిందని..మళ్లీ సినిమాల్లో పనికి వస్తాడా అని అన్నారు. 
Image result for sye raa narasimha reddy
కానీ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తర్వాత గత పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని..ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు చిరంజీవి.  దీంతో ఆయన అభిమానులు ‘బాస్ ఈజ్ బ్యాక్ ’ అంటూ సంతోష పడ్డారు.     ఈ సినిమా తర్వాత మరికొంత గ్యాప్ తీసుకొని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వతంత్ర సమరయోధుడి గాధ ఇతివృత్తంగా ‘సైరా నరసింహారెడ్డి’ 151 సినిమాలో నటిస్తున్నారు. మెగా అభిమానులతో పాటు మెగాస్టార్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి.
Image result for sye raa narasimha reddy
చిరంజీవి తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతోంది.  వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తొలుత ఆస్కార్ విజేత, సంగీత యోధుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవివర్మన్‌ను తీసుకున్నారు. అయితే వివిధ కారణాలతో వీరిద్దరూ ‘సైరా’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో రత్నవేలును కెమెరామన్‌గా ఎంపిక చేశారు.
Image result for sye raa narasimha reddy
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.తమన్‌ను ఎంపిక చేసినట్లు వార్తులు వచ్చినా అధికారికంగా ప్రకటించలేదు.  ఈ చిత్ర షూటింగ్ కోసం నగరంలోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ సిద్ధం చేశారు. ఈ సెట్‌లో తొలి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మేరకు సర్వం సిద్ధం చేసుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మేరకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: