తెలుగు చలన చిత్ర రంగంలో అతి కొద్ది మందే చరిత్రలో నిలిచిపోయే విధంగా తమ ప్రతిభతో ఎంతో మంది హృదయాలు కొల్లగొట్టారు.  అలాంటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అయితే..వారితో సమానంగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి. తెలుగు ఇండస్ట్రీలో సావిత్రి అంటే ఇప్పటికీ యువ హీరోయిన్లు ఎంతో ఇష్టపడతారు..ఆమె నటనా కౌశిలం..కేవలం కళ్లతోనే నవరసాలను పండించే గొప్ప నటి సావిత్రి.  కొందరు నటనను సాధన చేసి నేర్చుకుంటారు. కానీ అభినయం సహజసిద్ధంగా రావాలే కానీ నేర్చుకుంటే వచ్చేది కాదని మరికొందరు అంటారు. జీవితాన్ని నటనకే అంకితం చేసిన ఎందరో మహానటీనటులున్నారు.
Related image
అలాంటి మహానటి సావిత్రి. ఆమెను నటనకు ప్రతిరూపం అనవచ్చు. నిజానికి ఆమె నటన .. భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఒక పాఠశాల. కంటి చూపుతో కోటి భావాల్ని పలికించడమంటే మాటలు కాదు. ఆ సామర్థ్యం తనకొక్కదానికే ఉందని మహానటి సావిత్రి ఎన్నో పాత్రల్లో నిరూపించింది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను అశ్వినిదత్ కూతురు స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తోంది.
Related image
ఇప్పటికే సినిమా లో ముఖ్యపాత్రల గురించి పూర్తి సమాచారం అందించిన చిత్ర యూనిట్..త్వరలో టీజర్ కూడా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారట.  సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా మహానటి చిత్రానికి సంబంధించి ఓ సర్‌ ప్రైజ్‌ను అభిమానులకు అందించారు.సావిత్రి నవ్వు సమ్మోహితం. ఆమె అందం అతి సుందరం. అభినయం అనితరసాధ్యం. సునయన మనోహరంగా సావిత్రి తెరపై కనిపిస్తే ఆనాడు . .. నేడు కూడా లక్షలాది నట కళాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు.
Image result for mahanati stills
 ఆ మహానటి జీవిత నేపధ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా మహానటి చిత్రానికి సంబంధించి ఓ సర్‌ ప్రైజ్‌ను అభిమానులకు అందించారు. సావిత్రి అభిమానుల కోసం మహానటి లోగో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కొన్ని డైలాగులు ఉన్నాయి. మాయాబజార్ సినిమాలో ఉన్న మాయాపేటికను ఓపెన్ చేయగానే.. సమ్‌ స్టోరీస్‌ ఆర్‌ మీన్‌ టుబీ ఎపిక్‌ అంటూ.. మహానటి లోగో వస్తుంది. 
Related image
బ్యాగ్ గ్రౌండ్ సౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సమంత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు.. ఎస్వీఆర్‌ పాత్రలో, దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేషన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, విజయ్‌, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్, మాళవికా నాయర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి మహానటి సినిమాను తెరకెక్కిస్తున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: