యంగ్ హీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత ఏ హీరో అయినా కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడానికి సాహసించరు. సక్సెస్ ఫార్ములాతో కమర్షియల్ యాంగిల్ లో కంటిన్యూ అయిపోవడం కామన్. కానీ ఈ మ్యాటర్ లో బన్నీ కాస్త డిఫరెంటే.! నిన్నటి వరకూ బడా డైరెక్టర్స్ తో బడా హిట్స్ కొట్టిన బన్నీ.. ఇప్పడు కొత్త డైరెక్టర్స్ కి కనెక్ట్ అవుతున్నాడు. స్టోరీ నచ్చితే చాలు వారితో కలిసి ప్రయోగాలు చేయడానికి సై అంటున్నాడు.

Image result for allu arjun

అల్లూ అర్జున్ టాలీవుడ్ లో ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరో. బోయపాటి డైరెక్షన్ లో సరైనోడిగా సాలిడ్ హిట్ అందుకున్నాడు. 100 కోట్లు మార్కెట్ ఉన్న హీరోగా ఫోకస్ అవుతున్నాడు. డీజే కి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర 70 కోట్ల వసూళ్లతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేశాడు.

Image result for vakkantham vamsi

చేసిన ప్రతీ సినిమాకీ వేరియేషన్ చూపిస్తూ.. స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టి మరీ కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. స్టార్ రైటర్ గా వక్కంతం వంశీ అందరికీ సుపరిచితుడే.. కానీ ఇప్పటివరకూ దర్శకుడిగా అవకాశం రాలేదు. నా పేరు సూర్య చిత్రంతో వక్కంతం వంశీకి డైరెక్టర్ గా అవకాశమిచ్చాడు బన్నీ. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది.

Image result for allu arjun

వంశీకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్.. మరో అడుగు ముందుకేసి సంతోష్ రెడ్డి అనే మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్న్ సిగ్నెల్ ఇచ్చేశాడట. సంతోష్ చెప్పిన స్టోరీ బన్నీకి ఫుల్ గా నచ్చేయడంతో కేవలం ఒక్క సిట్టింగ్ లోనే సినిమా చేయడానికి సై అనేశాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారని సమాచారం.

Image result for allu arjun

స్టార్ స్టేటస్ ఉన్నబన్నీ సడన్ గా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ పెద్ద రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. కానీ దానికి రీజన్ వాళ్లు చెప్పిన సబ్జెక్ట్ పై బన్నీకున్న కాన్ఫిడెన్సే అంటున్నారు. స్టోరీ నచ్చి క్యారెక్టర్ డిమాండ్ చేయడంతోనే బన్ని బడా డైరెక్టర్స్ ని సైతం కాదని కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. కొత్త డైరెక్టర్లతో బన్నీ చేసే ప్రయోగాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో వేచి చూడాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: