నాగార్జున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘శివ’ తెలుగు సినిమాకు సంబంధించి ఒక ట్రెండ్ సెటర్. అప్పటిదాకా ఉన్న నిర్మాణ పద్ధతులను పక్కకుపెట్టి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా అది. 28 ఏళ్లక్రితం విడుదలైన ఈమూవీని ఒక నూతన ఒరవడి సృష్టించిన క్లాసిక్ గా ఇప్పటికీ విమర్శకులు ఆమూవీకి తెలుగు సినిమా చరిత్రలో ఒక స్థానాన్ని ఇస్తూ ఉంటారు. 

అంతేకాదు తెలుగు సినిమా రంగానికి సంబంధించి ‘శివ’ కు ముందు ‘శివ’ తరువాత అని విభజించి చెప్పుకునేంతగా ఆ సినిమా గురించి ఇప్పటికీ విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. నాగార్జునను మాస్ హీరోగా ఆనాటి యూత్ కు బాగా కనెక్ట్ చేసిన ఈమూవీ తరువాత నాగార్జున కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పెరిగి పోయింది. 

ఇటువంటి అలనాటి ట్రెండ్ సెటర్ సినిమా పై నాగార్జున చిన్నకొడుకు అఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అఖిల్ కు చాలాకాలం పాటు ఈసినిమా నచ్చలేదట. అంతేకాదు అఖిల్ మొదటిసారి ఈసినిమా చూసినప్పుడు ఈసినిమా తనకు అర్ధంకాలేదు అన్న సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఇప్పటి వరకు తాను 22 సార్లు ఆ సినిమా చూశానని అయితే తనకు ఆసినిమాను 16వ సారి చూసినప్పుడు మాత్రమే తనకు అర్ధం అయింది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు అఖిల్. 

ఇక తనకు సినిమాలలో నటించే అభిరుచి కలగడం తాను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు ఏర్పడింది అని అంటూ బహుశా చిన్నప్పటి నుండి తాను సినిమా వాతావరణంలో పెరగడంతో తనకు సినిమాల పై అభిరుచి ఏర్పడి ఉండవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు అఖిల్. అయితే అఖిల్ ‘శివ’ పై చేసిన కామెంట్స్ విన్నవారు అంతా అసలు ‘శివ’ కథ విషయంలో 16 సార్లు చూస్తే కాని అఖిల్ కు అర్ధంకాని విషయాలు ఏమున్నాయి అంటూ కొందరు అఖిల్ పై జోక్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: