టాలీవుడ్ లో నటిగా ఎంట్రి ఇచ్చి హీరోయిన్ గా ట్రాక్ మార్చిన బ్యూటి తేజస్వి. మొన్నటి వరకు పుల్ స్వింగ్ లో ఉన్న ఈ లేడీకి ప్రజంట్ బ్యాడ్ టైం బాదేస్తుంది. ఏ మూవీ ముట్టుకున్నా షాక్ కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. మరాఠి మూవీ బాలక్ పాలక్ రిమేక్ అయినా తనని గట్టెక్కిస్తుంది అనుకుంటే అది హ్యండ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది.

Image result for tejaswi madivada

అందానికి తగ్గ అభినయం చూపించి తక్కువ టైంలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిన బ్యూటీ తేజస్వి. మొన్నటి వరకు పుల్ జోష్ లో ఉన్నా.. సడన్ గా సీన్ మారింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తేజస్వి కెరీర్ ఎందుకో బ్యాక్ బెంచ్‌లో ఉండిపోయింది. బాగా నమ్ముకొని చేసిన సినిమాలు రివర్స్ అవ్వడం.. బాలీవుడ్‌ హంటర్ రీమేక్ బాబు బాగా బిజీ కూడా తేజస్వికి సక్సెస్‌ ఇవ్వలేకపోయింది.

Image result for tejaswi madivada

రీసెంట్ గా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ లో ఐటెం సాంగ్ చేసి సందడి చేసిన తేజు ప్రజంట్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరాఠీ చిత్రం బాలక్ పాలక్‌ రీమేక్‌లో నటిస్తోంది. యువ దర్శకుడు శ్రీకాంత్ వెలగలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీఎఫ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. ఓ వయస్సు ఉండే యువతి, యువకులకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కలిగించే చిత్రంగా రూపొందించనున్నారు. ఈ చిత్రంలో తేజస్వి లీడ్ రోల్ లో నటిస్తుంది. మరాఠీలో రవి జాదవ్ తీసిన ఈ సినిమాకి అక్కడ మంచి ప్రశంసలు లభించాయి.

Image result for tejaswi madivada

మొన్నటి వరకు వేగంగా షూటింగ్ జరుపుకొన్నది ఈ సినిమా యూనిట్. కానీ ఇటీవల కాలంలో ఈ సినిమా షూటింగ్ అంతగా ప్రోగ్రెస్ లేదు. ఏం జరుగుతున్నది అనే విషయంపై పెద్దగా సమాచారం కనిపించడంలేదు. రీసెంట్ గా ఇదే విషయం తేజస్విని అడిగితే నిర్మాత, దర్శకుల నుంచి కూడా సరైనా సమాచారం లేదు చెప్పింది.

Image result for tejaswi madivada

ఎలా చూసినా బాలక్ పాలక్ రిమేక్ బీఎఫ్ చిత్రంతో తిరిగి తన సత్తా చాలనుకున్న తేజస్వికి బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రజెంట్ ఏ మూవీ ముట్టుకున్న షాక్ కొట్టడంతో తన కెరీర్ స్లో అయింది. మరి నెక్ట్ ఇయర్ అయినా ఈ బ్యూటీ డ్యూటీ స్పీడ్ అందుకుంటుదేమో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: