రేపు విడుదల కాబోతున్న ‘ఎంసిఎ’ మూవీని ప్రమోట్ చేస్తూ నాని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం వరస విజయాలలో దూసుకుపోతు డబల్ హ్యాట్రిక్ పై కన్ను వేసిన నానీ నోటి వెంట ఇలాంటి కామెంట్స్ రావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘ఎంసిఎ’ సినిమా పై ఇప్పటి వరకు వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ నాని ఈసినిమా కథ ఒక రొటీన్ కథ మాత్రమే అంటూ సంకేతాలు ఇస్తున్నాడు.

 

ఈసినిమా ద్వారా తన అభిమానులు ఒక ప్రత్యేకమైన స్టోరీ లైన్ ను ఆశించవద్దని తన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడ మానసికంగా సిద్ధం చేస్తున్నాడు నాని. ఈమధ్య కాలంలో నాని సినిమాలు రొటీన్ కథలతో వస్తున్న నేపధ్యంలో తన సినిమాల పై వస్తున్న విమర్శలకు తిప్పి కొడుతూ నాని కేవలం ప్రేక్షకులను నవ్వించే సన్నివేశాలు తప్ప ఎటువంటి అద్భుతాలను తన ‘ఎంసిఎ’ లో ఆశించవద్దు అంటూ వ్యూహాత్మకంగా ఈసినిమాకు డివైడ్ టాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని.

 

రేపు విడుదల అవుతున్న ‘ఎంసిఎ’ టీజర్ - ట్రైలర్ చూసినవారు చాలామంది ఈసినిమా  ‘రేసుగుర్రం’ ఫార్మాట్లో సాగే కథలా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసిన నేపధ్యంలో నాని ఈ విషయం పై స్పందిస్తూ ‘ఎంసీఏ’ కొత్త తరహా సినిమా ఏమీ కాదని ఇలాంటి సినిమాలు గతంలో వచ్చాయి అంటూ లీకులు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఈ తరహా సినిమాలలో ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యమైన విషయమని అది వర్కవుటైతే సినిమా ఆడుతుందని నాని అనడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 

ఇదే సందర్భంలో నాని మాట్లాడుతూ రేపు విడుదల కాబోతున్న ‘ఎంసిఎ’ కథ లాంటి సినిమాలు గతంలో వచ్చినా ట్రీట్మెంట్ విషయంలో కొత్తదనాన్ని చూపెడుతూ తాము ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు అందరికీ నచ్చుతుంది అని అంటున్నారు. అయితే వరస విజయాలతో దూసుకుపోతున్న నానీకి ఇప్పుడు అన్ని విధాలా కాలం బాగున్న నేపధ్యంలో రేపు విడుదల కాబోతున్న ఈసినిమా ఎటువంటి విజయాన్ని నానీకి ఇస్తుందో చూడాలి..   

 


మరింత సమాచారం తెలుసుకోండి: