నిన్నటిత‌రంలో యావత్ భార‌త‌దేశాన్ని ఓ వూపు ఊపేసిన క‌థానాయిక శ్రీదేవి. బోణీక‌పూర్‌తో వివాహమ‌య్యాక ఆమె తెర మ‌రుగైపోయింది. ఎంతోమంది అభిమానులు మూగ‌గానే రోధించారు. ఆ త‌ర్వాత కొన్ని యేళ్లు గ‌డిచిపోయాయి. ఇక శ్రీదేవిని తెర‌పై చూడ‌లేం అనుకొన్నారంతా. కానీ ఆమె మాత్రం మ‌ళ్లీ తెర‌పై త‌ళుక్కుమంది. ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో. ఆ చిత్రంలో శ్రీదేవి క‌నిపించిన విధానం, ఆమె అందం కుర్రకారును మెస్మరైజ్ చేసింది.

దీంతో శ్రీదేవిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. వోగూ అనే సంస్థకోసం శ్రీదేవిపై చేసిన ఫొటో షూట్ మామూలుగా లేదు. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి ఫొటోలు. అర‌వ‌య్యేళ్ల వ‌య‌సులోనూ శ్రీదేవి కనిపించిన విధానం ప్రేక్షకుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకొంది.

శ్రీదేవికి రెండో ఇన్నింగ్స్ బాగా అచ్చొచ్చిన‌ట్టుంది. త‌న సినిమా విజ‌య‌వంతం కావ‌డంతో ఆమెకు భారీగా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఎంతోమంది ప్రముఖ ద‌ర్శకులు వ‌చ్చి శ్రీదేవికి క‌థ‌లు వినిపించి వెళుతున్నారు.
శ్రీదేవికోసం హిందీలోనే కాకుండా తెలుగు, త‌మిళ‌భాష‌ల్లోనూ ద‌ర్శకులు క‌థ‌ల‌ని, పాత్రల‌ని సిద్ధం చేస్తున్నారు. శ్రీదేవి అందం మ‌రో ప‌దేళ్లయినా ఇలాగే ఉంటుంద‌ని ప‌రిశ్రమ వ‌ర్గాలు అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: