నేచుర‌ల్ స్టార్ నాని సినిమా వ‌స్తుందంటే చాలు హిట్ టాక్ ముందే వ‌చ్చేస్తోంది. ఇప్ప‌టికే డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతోన్న నాని న‌టించిన లేటెస్ట్ సినిమా ఏంసీఏ. దిల్ రాజు బ్యాన‌ర్‌లో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి ట్యాగ్‌లైన్‌తో వ‌చ్చిన ఈ సినిమాలో నాని స‌ర‌స‌న ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసేసిన సాయి ప‌ల్ల‌వి న‌టించింది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది.

mca movie images కోసం చిత్ర ఫలితం

టాలీవుడ్‌లో గ‌తంలో ఎన్నో సినిమాల్లో చూసేసిన రొటీన్ స్టోరీ లైన్‌ను ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఎంసీఏ సినిమాకు తీసుకున్నాడు. ఫ‌స్టాఫ్‌లో కామెడీ మిక్స్ చేసి, నాని - సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్‌తో బండి న‌డిపించేశాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు సినిమా ఎంజాయ్ చేసేలా ఉంది. సినిమాకు కీల‌క‌మైన సెకండాఫ్ మాత్రం క‌థ‌నం గాడిత‌ప్పింది. రొటీన్ స్టోరీకి, మూస ఫార్మాట్ క‌థ‌నంతో ఆస‌క్తి క‌లిగించ‌దు.


ఇక సీనియ‌ర్ హీరోయిన్ భూమిక నాని వ‌దినగా న‌టించ‌డంతో ఈ రోల్‌కు మంచి స్కోప్ ఉంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తారు. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రిది - వ‌దిన అనుబంధం ఇంకా డెప్త్‌గా చెప్పాల్సి ఉండాల్సింది. వీక్ సెకండాఫ్‌తో పాటు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ వీక్‌గా ఉండ‌డం కూడా సినిమాకు మ‌రో మైన‌స్‌. ప్రీమియ‌ర్ త‌ర్వాత ఎంసీఏ నానికి మ‌రో హిట్ ఇస్తుందా ? అంటే గ్యారెంటీగా ఎస్ అన్న టాక్ అయితే లేదు. మ‌రో వైపు అక్కినేని వార‌సుడు అఖిల్ హ‌లో కూడా రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. హ‌లో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆ సినిమాను త‌ట్టుకుని ఎంసీఏ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలా పెర్పామ్ చేస్తుందో ?  చూడాలి. 

mca movie images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: