హాట్ యాంకర్ అనసూయకు గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయిన సందర్భం తెలిసిందే. ఈ విషయమై పవన్ అభిమానులు అనసూయల మధ్య గతంలో మాటల యుద్ధం కూడ జరిగింది. తన టెలివిజిన్ షోలతో బిజీగా ఉండే అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన అభిమానులకు షేర్ చేస్తూ తన ఇమేజ్ ను పెంచుకునే టెక్నిక్ అనసూయకు బాగా తెలుసు.

 

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పవన్ ‘అజ్ఞాతవాసి’ మ్యానియాను తన ఇమేజ్ పెంచుకోవడానికి వాడుకుంటోంది. ‘అజ్ఞాతవాసి’ పాటలలో పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చిన ‘బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీ వో క్లాక్’ పాటకు తాను తనదైన రీతిలో స్టెప్స్ వేస్తూ పవన్ బాడీ లాంగ్వేజ్ ను అనుసరిస్తూ అనసూయ తయారుచేసిన వీడియో ఇప్పుడు పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

 

ఇప్పటికే పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటున్న ఈపాటకు అనసూయ అదనంగా కొత్త ఫ్లేవర్‌ను యాడ్ చేసి వేల సంఖ్యలో హిట్స్ లైక్స్ పొందుతోంది. ఈ పాటకు సంబంధించిన పదాలకు లయబద్దంగా అనసూయ తన శరీరాన్ని కదలించి అందర్నీ ఆకట్టుకుంది. ఈవీడియో పోస్టు చేసిన నాలుగు గంటలలోనే 5 వేల మంది లైక్ చేసారు అంటే ‘అజ్ఞాతవాసి’ మ్యానియాను అనసూయ తనకు అనుకూలంగా ఎలా తెలివిగా మార్చుకుందో అర్ధం అవుతుంది.

 ANASUYA ALONG WITH PAVAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

గతంలో మిస్టర్ ఇండియాలోని శ్రీదేవి డ్యాన్స్ చేసిన ‘హవా హవాయి’ అనేపాటకు కూడ అనసూయ ఇలాగే ఒక వీడియోను తయారుచేసి శ్రీదేవిలా మురిసిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ తో కలిసి నటిస్తున్న అనసూయ ఇప్పుడు ఇలా పవన్ ‘అజ్ఞాతవాసి’ క్రేజ్ ను కూడ వాడుకుంటూ గతంలో తన పై కోపం తెచ్చుకున్న పవన్ అభిమానుల కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తోంది.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: