అర్జున్ రెడ్డి సక్సెస్తో టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కోలీవుడ్ పై కూడాఫోకస్పెట్టాడు  అదిరిపోయే సబ్జెక్ట్ దొరకడంతో తమిళనాట సినిమా చేసేందుకు రెడీ అవుతున్నానని ప్రకటించాడు.  

Image result for vijay devarakonda

గతంలో విక్రమ్ హీరోగా 'ఇంకొక్కడు' అనే సినిమాను తెరకెక్కించిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తన తొలి తమిళ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. స్టుడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అర్జున్ రెడ్డి టైపులో ఇది కూడా ఓ కొత్త తరహా స్క్రిప్ట్ అంటున్నాడు విజయ్.



"పెళ్ళిచూపులు-అర్జున్‌రెడ్డి" వంటి విభిన్న విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తమిళం చిత్రరంగంలోకి ప్రవేసిస్తున్నారు. తమిళం అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన "స్టూడియో గ్రీన్‌" బ్యానర్‌ ద్వారా విజయ్ దేవరకొండను కథానాయకునిగా నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో పరిచయం చేస్తున్నారు.  

Image result for vijay devarakonda hd images

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, "ఆనంద్‌ శంకర్‌ చెప్పిన వైవిధ్యమైన కథకు దాని కథనానికి విజయ్ దేవరకొండ బాగా ఇంప్రెస్‌ అయ్యారు. దీంతో వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నాం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను ప్రారంభిస్తాం" అని అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాక్సీవాలా, మహానటి, గీతా గోవిందం, ఏ మంత్రం వేశావే, చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.

Image result for vijay devarakonda hd images

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువై అర్జున్ రెడ్డి సినిమాతో యువత లో క్రేజ్ సంపాదించిన విజయ్ దేవర కొండ నూతన సంవత్సర, క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన అభిమాన ప్రేక్షకులకు "సర్‌ప్రైజ్ గిఫ్ట్స్" ఇచ్చేందుకు సిద్ధమౌతు న్నారు. గిఫ్ట్ అంటే తను చేయబోయే చిత్రాల టీజర్, ట్రైలర్‌ ను విడుదల చేయడం లేదు. ప్రత్యేకంగా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం అర్జున్ రెడ్డి గ్రీటింగ్‌పై స్వయంగా ఒక కొటేషన్ రాసి, "ఆటోగ్రాఫ్‌తో కూడిన గిఫ్ట్ ప్యాక్‌" ను తన అభిమానులకు "న్యూ ఇయర్ గిఫ్ట్‌" గా పంపనున్నాడు విజయ్ దేవరకొండ.

Image result for mahanati vijay devarakonda

"ఈ లైఫ్ టైమ్‌లో అందరికీ నేను థాంక్స్ చెప్పలేనేమో! "ముందుగా అయితే మొదలెడుతున్నా సోషల్ మీడియా నుండి ఒక యాభై మందిని సెలక్ట్ చేసి వారికి పర్సనల్‌ గిఫ్ట్స్ పంపిస్తున్నా" అంటూ న్యూ ఇయర్ గిఫ్ట్స్ రెడీ చేస్తున్న వీడియోను తన ఫేస్‌-బుక్ ఖాతా ద్వారా షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ వీడియోలో తనకు అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఫ్యాన్స్ నుండి ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

Image result for mahanati vijay devarakonda

జనానికి నచ్చే సినిమా చేస్తే మనల్ని ఎక్కడకో తీసుకుపోతారు, నాకు తెలిసి వాళ్లకు నచ్చిన మూవీ చేస్తే చాలు, వాళ్ల పర్సనల్ లైఫ్‌ లోకి కూడా మనల్ని ఆహ్వానిస్తారు. అలాంటి అభిమానులకు థాంక్స్ చెప్పాలనిపిస్తుంది.  కాని, కేవలం స్టేజ్ మీద థాంక్స్ చెప్తే ఏం సరిపోతుంది. అందుకు వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించి న్యూ ఇయర్‌కి గిఫ్ట్స్ పంపిస్తున్నానని అన్నారు. మరి అర్జున్ రెడ్డి పంపిన గిఫ్ట్స్‌ లో ఏమున్నాయో? ఇంతకీ ఆ లక్కీ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరో? తెలియాలంటే, "2018 న్యూ ఇయర్"వరకూ ఆగాల్సిందే.

Image result for vijay devarakonda new year gifts to fans

మరింత సమాచారం తెలుసుకోండి: