‘కాటంరాయుడా.. కదిలి నరసింహుడా’ అంటూ పవన్ కళ్యాణ్ పాడిన పాట వెనుక ఆయన ఆడిన ఖతర్నాక్ గేమ్ ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నిజానికి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఈ పాటను పాడించడం వెనుక ఈ గేమ్ లేదు కాని ఇప్పుడు ఆపాటను మీడియాలో రిలీజ్ చేసి విస్తృత ప్రచారం చేయించడం వెనుకనే అసలు రహస్యం దాగుంది అంటున్నారు.

ఈపాట పూర్థిగా తెలంగాణ వారి జానపదంవలే ఉంది, ఈపాటలో అన్ని ప్రాంతాల వారిని గొప్పగా స్పృషించారు రచయిత, అంతేకాదు ఇది తెలంగాణ వారి మదిని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. కాటంరాయుడా.. కదిలి నరసింహుడా అన్న మొదటి వాక్యంలోనే తెలంగాణ వారు పులకించి పోతారు, కారణం ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలం కదిలి గ్రామంలో వెలసిన కదిలినరసింహుడు తెలంగాణావాదులు అత్యంత భక్తిప్రపత్తులతో పూజిస్థారు, అయితే ఈ ఆలయానికి ఇప్పటివరకు ప్రాచుర్యం లభించలేదు, ఇప్పుడు పవణ్ పుణ్యమా అని అది జరుగుతోంది.

నిజానికి ఈ పాటను 1940లో వచ్చిన ‘సుమంగలి’ అనే క్లాసిక్ చిత్రంలోనిది, ఈపాటను త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ లు దగ్గరుండి పవన్ కళ్యాణ్ తో పాడించారు. ఇప్పుడు విభజన సెగలు ఉడికి పడుతున్న నేపథ్యంలో ఇరుప్రాంతాల వారి మనోభావాలను ప్రతిభింబించే విదంగా ఉన్న ఈ పాట ‘అత్తారింటికి దారేది’ సినిమాలో స్వయంగా పవన్ కళ్యాణ్ పాడారని తెలిస్థే ఈ సినిమా పై నెలకొన్న విద్వేషం తగ్గి ఆ సెగనుంచి బయటపడవచ్చన్న ఆలోచనే ఈ ప్రచారం అంటున్నారు టాలివుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: