అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని మొదటి సినిమా ‘అఖిల్’ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో తన తదుపరి సినిమా మంచి హిట్ కొట్టాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు.   'మనం' ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన సినిమా 'హలో'.  ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. 
Image result for hello movie stills
అఖిల్ కెరీర్‌లో రెండో సినిమాగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఓ అందమైన పాత్ర పోషించి అందరినీ మెప్పించింది.సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ పలు మలయాళం, హిందీ సినిమాలతో పాటు గతంలో రెండు తెలుగు సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు.  ఇక హీరోయిన్ లిజి..చేసింది కొన్ని చిత్రాలే అయిన మంచి పేరు తెచ్చుకున్నారు. 
Image result for hello movie stills
ప్రియదర్శన్, లిజి కూతురే.. కల్యాణి ప్రియదర్శన్ .  తండ్రి డైరెక్టర్ కావడంతో ఆమె కూడా ఆయన ప్రోత్సాహంతో దర్శకత్వశాఖలో పని చేస్తోంది. విక్రమ్ నటించిన 'ఇంకొక్కడు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసింది.   హీరోయిన్‌గా ఈమెకు ఇదే మొదటి సినిమా.  మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన కళ్యానికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో అంతా "కల్యాణి.. ఐ హేట్ యూ" అంటూ వరుసగా మెసేజ్ లు పెట్టేస్తున్నారట.
Image result for hello moive stills
అదేంటీ ఐ హేట్ యూ అని మెసేజ్ పెట్టడం ఏంటా అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే..హలో సినిమా కాన్సెప్ట్ ప్రకారం 'ఐ లవ్ యూ' అంటే .. ఎవరెస్టు అంత ప్రేమ .. 'ఐ హేట్ యూ' అంటే ఆకాశమంత ప్రేమ. ఎవరెస్టుకి ఒక పరిధి అనేది వుంది .. కానీ ఆకాశానికి లేదు. అందువలన ఈ సినిమా కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకుని అంతా ఆమెకి 'ఐ హేట్ యూ' అంటూ మెసేజ్ లు చేస్తున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: