సల్మాన్ ఖాన్ భాలీవుడ్ కింగ్ ఖాన్. మన ఇండియా లో అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తన సినిమాలతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతుంటాడు. అలాగే తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటాడు. అయితే వీటితో పాటు ఎప్పుడు ఏదో ఒక వివాదంలో   ఉంటాడు. ఇంతకు ముందు ఫుల్ గా తాగి డ్రైవ్ చేసి ఫుట్ పాత్ మీద పడి ఉన్న ఒకరిని ఆక్సిడెంట్ చేసి ఒకరి చావుకు కారణమైనాడు అని కోర్ట్ లో ఆరోపణలు ఎదుర్కోన్నాడు.

Image result for salman khan

తరువాత రేప్ కు గురైన భాదితుల మీద వివాదస్పద వ్యాఖ్యలు చేసినాడు. అప్పుడు అందరు తన మీద విమర్శలు గుప్పించినారు. అయితే ఇంత పేరు ప్రఖ్యాతలు కలిగిన సెలబ్రెటీస్ పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియక పోవడం బహు శోచనీయం. అయితే తాజాగా ఒక వర్గం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లి వార్తల్లో నిలిచినాడు.

Image result for salman khan

ఒక డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చిన సల్మాన్ ఖాన్ తన డ్యాన్సు ఏమైనా  ''భాంగి'' డ్యాన్సు మాదిరిగా ఉందా అని మాట్లాడినాడు. దాంతో వాల్మీకి వర్గం వారు కోపోద్రుక్తులయ్యారు. వారి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు యస్సీ , యస్టి అట్రాసిటి కేసు నమోదు చేసినారు. జాతీయ షెడ్యూల్ కమిషన్ డిల్లీ పోలిసుల నుంచి వివరణ కోరింది.

Image result for salman khan

మరియు శిల్పా శెట్టి కూడా అదేవిధంగా వివాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే తరువాత తను ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. కాని ఇంకా సల్మాన్ ఖాన్ ఎటువంటి క్షమాపణలు చెప్పలేదు. దీనితో అతను ఇబ్బందల్లో పడినట్లైంది. ఇటువంటి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నా నటీ నటులు పబ్లిక్ లో ఉన్నప్పుడు తమరు ఏం మాట్లాడుతున్నారో అలోచించి మాట్లాడాలని  అందరు అభిప్రాయ పడుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: