విజయ్ దేవరకొండ గా కంటే అర్జున్ రెడ్డిగా బాగా పాపులర్ అయిన ఈ యువ కథానాయకుడు ఈ సంవత్సరం అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతాఇంతా కాదు . సినిమా విడుదలయి నాలుగు నెలలు గడిచినా యూత్ లో అర్జున్ రెడ్డి ఫీవర్ ఇంకా తగ్గలేదు.హీరోగా తన తొలి సినిమా పెళ్ళిచూపులతో హిట్ కొట్టడమేగాక ఆ సినిమా జాతీయ అవార్డులను కూడా సాధించి విమర్శకుల ప్రశంసలు కుడా అందుకుంది.ఆతరువాత చేసిన ద్వారక సినిమా పెద్గగా వసూళ్ళు రాబట్టలేకపోయింది .అప్పటినుండి ఆచితూచి సినిమా ఎంపికలో జాగ్రత్త వహిస్తున్న విజయ్ అర్జున్ రెడ్డి సినిమా తో భారీ విజయాన్ని సాధించాడు.

 

అయితే సినిమా విడుదల సమయంలో వివాదాలు చుట్టుముట్టినా బోల్డ్ చిత్రంగా యూత్ మొత్తాన్ని ఆకర్షిచింది .ఈ చిత్రం నటనతో విజయ్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది.అర్జున్ రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ కు ఈ మధ్యనే జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ 2017 సంబందించి మెగాస్టార్ చిరంజీవిగారి చేతుల మీదనుండి ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నాడు

  

సోషల్ మీడియా లో కూడా విజయ్ తరచూ అభిమానులతో టచ్ లో ఉంటాడు.ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమా అభిమానులకి కూడా క్రిస్మస్ కానుకగా గిఫ్టులు కూడా అందించాడు.సోషల్ మీడియా లో పెట్టిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అయింది . విజయ్ ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకల నిమితం బార్సిలోనా (స్పెయిన్) చేరుకున్నాడు . బాల్కనీ నుండి బార్సిలోనా అందాలని ఆస్వాదిస్తున్నట్లుగా ట్విట్టర్ లో ఒక ఫోటో పెట్టగా పెట్టిన రెండు గంటల వ్యవధిలోనే లైకులు ,రిట్వీట్ లతో ఇంటర్నెట్ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.అయితే విజయ్ ప్రస్తుతం అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: