పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా మరో 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అంచనాలు చూస్తుంటే పవన్ మరోసారి రికార్డుల చెడుగుడు ఆడటం ఖాయమని అనిపిస్తుంది. ఆడియో, టీజర్ ఓకే కాని సినిమా ట్రైలర్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దానికి కారణాలేంటో తెలియదు కాని సినిమా రిలీజ్ మరో నాలుగు రోజులే ఉండగా ఎందుకు ట్రైలర్ రిలీజ్ చేయలేదో అర్ధం కావట్లేదు.


అయితే ఓ పక్క సినిమా కాపీ వివాదం వినిపిస్తుండగా.. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు ఇంటెలిజెంట్ కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి టీ సీరీస్ వారికి నష్ట పరిహారం కూడా చెల్లించారని అంటునారు. మరి అసలు విషయం ఏంటో తెలియాల్సి ఉంది. అయితే సినిమా రిలీజ్ హంగామా మొదలవగా ఫైనల్ గా ఈరోజు సాయంత్రం 6:30 కు అజ్ఞాతవాసి సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారట.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ ఈ సినిమా ఎంతో ప్యాషనేట్ గా నిర్మించారు. మలయాళ భామలు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారని తెలిసిందే. మొత్తానికి పవన్ ట్రైలర్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. సినిమా టీజర్ లో పవన్ డైలాగ్ మిస్ అవగా ట్రైలర్ లో కచ్చితంగా అది ఉండేలా చూస్తారేమో చూడాలి. 


ఇక సినిమా సెన్సార్ టాక్ మాత్రం పాజిటివ్ గా ఉంది. యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న అజ్ఞాతవాసి సినిమా 2:38 నిమిషాల డ్యూరేషన్ తో వస్తుందట. సినిమాలో పవన్ పాడిన కొడకా కోటేశ్వర్ రావు సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి సినిమా ఫలితం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: