బాహుబలి అమోఘమైన విజయంతో, టాలీవుడ్ చరిత్రగతి మార్చి బాలీవుడ్ తలదన్నేసింది. భారతీయ చిత్ర దిశ దశ మార్చే సింది. ఏభై రోజుల్లోపలే పదిహేను వందల కోట్ల వసూళ్ళు సాధించి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు నూతన లక్ష్యాలు నిర్దే శించింది. నిర్మాణ విలువల ప్రాముఖ్యత చాటిచెప్పింది. దర్శకత్వ ప్రతిభకు సరిహద్దులు లేవని కథానాయకుల ఆధిఖ్యత కు చెక్ చెప్పి - ఆస్థానం లో నిర్మాణ ప్రణాళికలు అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలు దర్శకత్వ సామర్ధ్యాలకు ఎల్లలేవని నిరూపించింది. భారత ప్రాంతీయ సినిమాలకు భారత జాతీయ బాలీవుడ్ చిత్ర రంగానికి సరిహద్దులు చెరిపేసింది.

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

రజనీకాంత్ తరవాత దక్షిణాపథ నటసార్వబౌమత్వానికి అర్హత సాధించటమే కాదు ప్రపంచ స్థాయి చిత్రానికి కథానాయకుడు కావటమేకాదు భారత చలన చిత్ర రంగ చరిత్రనే తిరగరాసిన నాటి మౌర్య చంద్రగుప్తుని విజయ విలాసాన్ని నట యవనికపై ప్రదర్శించిన ఘనత “రాజమౌళి-ప్రభాస్” లకే దక్కింది.

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

15 సంవత్సరాలు 15 సినిమాలు ఫైటింగ్స్, ఫాక్షన్ & యాక్షన్ - మృదువైన ప్రేమకథలు తో ప్రేమ గీతాలు - ఇదీ బాహుబలికి ముందున్న ప్రభాస్ సినిమాల చరిత్ర. అయితే బాహుబలి రెండు పార్టు ల తరవాత "భారతీయ సినిమాల చరిత్రకు ప్రాణాధారం" అయిపోయాడు ప్రభాస్.

Related image

బాహుబలి ఘనతర విజయం తరవాత  శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ తో కలసి నటిస్తున్న ప్రతిష్టాత్మక "సాహో" త్రిబాషా చిత్రం నుండి కాస్తంత విరామం తీసుకొని “సుర్యకాంతి తడిలో మెరిసిపోయే భూలోక స్వర్గం అనదగ్గ ‘లాస్-యాంజెలస్’ లో వినోదిస్తున్న ప్రభాస్ ను 'జిక్యూ మెన్స్ మాగజీన్”  ప్రభాస్ ను తన మాజీ విఖ్యాత మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డర్ - వ్యక్తిగత శిక్షకుడు, పొట్టి చెఫ్ మరియు తన కజిన్ తానున్న “బేవర్లి హిల్స్ అతిది గృహం” అద్భుతమైన సువాసనలు వెదజల్లే 'తిల్డా బాస్మతి రైస్' తో చేసిన బిరియాని ఉన్న డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళారు డైరెక్టుగా ఎంట్రెన్స్ నుంది.


రెండు బాహుబలి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే 45 కోట్ల రూపాయిల అత్యంత అధిక పారితోషికంతో పోలిస్తే ప్రభాస్ తన గత సినిమాలకు 10000 రెట్లకు పైగా ప్రతిష్ట, సంతృప్తి లభించిందని ఉత్సాహంగా చెప్పారు.


మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ సినిమాలతో “డార్లింగ్ ఆఫ్ టాలీవుడ్” అయ్యారు ప్రభాస్. వర్షం, చత్రపతి, మిర్చి సినిమాలు ఆయనకు "ఇండస్ట్రి బ్లాక్బుస్టెర్స్”  గా మిగిలాయి అంతేకాదు ఆయన అప్పటికి ప్రాంతీయస్థాయి అభిమానులనే పొందగలిగారు. కాని ఐదు సంవత్సరాలు సుధీర్ఘంగా రాజమౌళి "చారిత్రాత్మక దృశ్య సాంకేతిక చిత్రరాజం" లో మునిగిపోయారు.

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

ఒంటి చేత్తో ఆ శివలింగాన్నే పెకలించి పైకెత్తారు. యుద్ధ విద్యలు, కత్తి- కర్ర సాములు, అస్త్ర శస్త్ర ప్రయోగాలు, గుర్రపు స్వారి, బలమైన వృషభ రాజాలను మల్లయుద్ధంలో లాగా  నిలువరించారు, మత్తెక్కిన మత్త మద గజరాజాల కుంభస్థలాలనే అధి రోహించారు తన అభిమానుల్నేకాదు విశ్వ ప్రేక్షక జనావళిని అద్భుతాలతో ఆనంద కేళిలో తానాలు చేయించి మురిపించారు. తమను తామే మరచిపోయేలా చేశారు.


బాహుబలి రెండు పార్టుల చారిత్రాత్మకతతో ఆయన పేరు విశ్వమంతా గృహాల్లోనే కాదు అన్నీచోట్ల మార్మోగిపోయింది. చలన చిత్రరంగపు బారికేడ్లను చెరిపేసి టాలీవుడ్ కోలీవుడ్ బాలివుడ్ సరిహద్దు లను చెరిపేశారు. విశ్వనటుడే అయ్యారు.

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

ఈ అదృష్టం తరవాత ఏం జరుగుతుందో? భవిష్యత్ తనను ఏతీరాలకు చేరుస్తుందో?  అంటూ ఒక వేదాంతిలా మాట్లాడారు. ఇప్పుడు ప్రభాస్ ను వేదించే సమస్య ధనం కీర్తి కాదు. తన అభిమాను ల్లో తనపై పెరిగిపోయిన హిమోన్నతమంత అభిమానాన్ని కొనసాగించటం ఎలా? అనేదే వేదిస్తు న్న అతి ప్రధాన సమస్య అన్నారు.


ఒక సందర్భంలో ఆయన తన పెదనాన్న నాటి టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజును, తండ్రిని సూర్యనారాయణ రాజు గుర్తు చేసుకున్నారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు యాక్వాకల్చర్ ప్రధాన వృత్తిగా చేసుకొని డబ్బు సంపాదించాలనే తపనని వ్యవసాయంలో తరించాలనుకున్న వైనాన్ని కూడా ఙ్జప్తికి తెచ్చారు.

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

సూర్యనారాయణ రాజు భార్య శివకుమారిలకు ప్రమోద్, ప్రగతి తరవాత మూడవ సంతానమే ప్రభాస్.  నేడు తనకు లేని డబ్బు ఇబ్బందులు-నాడు తన తండ్రి  ఇతర నిర్మాతల్లానే సినిమాల నిర్మాణంలో ఎంతో నష్టపోయి డబ్బు ఇబ్బందుల్లో పడి విల విల్లాడిన విషయాన్ని ఙ్జప్తికి తెచ్చు కొన్నారు.


తన తండ్రి నష్టాల్లో కూరుకున్నప్పడు డబ్బు కోసం పడ్ద కష్టం తో అనుభవించిన మద్యతరగతి జీవితాన్ని సిటీ బస్ లలో తిరిగిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు నాడు తాను సిటీ బస్ లో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు "గొప్ప కుటుంబానికి చెందిన ఈ అబ్బాయి - ఇలా" అన్న ప్పుడు నాలో కష్టపడి పని చేసి తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలనే పట్టుదల తనలో పెంచా యన్నారు. 

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

తను తన తండ్రి సినిమా నిర్మాత సుర్యనారాయణ పెదనాన్నలతో ప్రముఖ నటుడు బిజెపి ఎంపి అయిన కృష్ణం రాజు తను సినిమాల్లో నటించాలన్నప్పుడు ఈ సిగ్గరి సినిమాల్లో నటించ గలడా? అనుకున్నారట. కాని యాక్టింగ్ స్కూల్ లో చేరి తనను తాను ఎంతగానో మార్చుకొని ముందుకు సాగానన్నారు.


అతి చిన్న గ్రామం నుండి కలలను సకారం చేసుకోవాలనే సంకల్పంతో భాగ్యనగరం చేరిన ఈ వ్యవసాయిక గ్రామీణుడికి - వీధి క్రీడలు, పల్లెలొని స్నేహితుల సాంగత్యం, గ్రామీణ విద్యల పునాదులతో తెలుగు చిత్ర రంగం ఇచ్చిన ప్రోత్సాహంతో నటనకే నిర్వచనం నేర్పే స్థాయికి చేరటం కలల సౌధం నిర్మించుకోటం అనేది అతి చిన్న విషయంగా మార్చేసింది.

Image result for GQ mens magazine Interview with bahubali heroa prabhas in telugu

తన పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఏ రెస్టారెంటో ఆ తరవాత మహా ఐతే ఒక పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదగగల ననుకున్న స్థితి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిల పరిది లోకి ఊహాతీతంగా చేర్చిన అదృష్టం చివరకు – “మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఒక వాక్స్ శిల్పం” ప్రతిష్టించే స్థాయికి చేర్చటం గొప్ప అదృష్టం కాక మరేమిటన్నారు.   

Related image

కలలు కనండి సాకారం చేసుకోండి అన్న కలాం మహనీయుని మాటలను కలలను ఇలలోకి తెచ్చిన ప్రభాస్ ప్రాభవం గురించి చెప్పాలంటే ఒక చరిత్ర రాయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: