ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రారంభంకాబోతున్న ‘అజ్ఞాతవాసి’ మొదటిరోజు కలెక్షన్స్ రికార్డుల విషయం పై ఒకపక్క చర్చలు జరుగుతూ ఉంటే ఈసినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలోని  కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఈమూవీ పై అనుసరిస్తున్న రాజకీయాలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.  సినిమారంగంలో రాజకీయాలకులోటు ఉండదు అన్నది ఓపెన్ సీక్రెట్. ఒక టాప్ హీరో సినిమా వస్తోంది అంటే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామనుకునే వాళ్లు ఎంతమంది వుంటారో? నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్లూ అంతకు రెట్టింపుగా సరైన అవకాసంకోసం ఎదురుచూస్తూ ఉంటారు.  

 

ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్ళ కామెంట్స్ టాప్ హీరో సినిమావిడుదల రోజున చాలా కీలకంగా పనిచేస్తాయి. ఇది ఇలాఉండగా ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించి చాలాఏరియాలలో అదేవిధంగా ఓవర్సీస్ లో ఈసినిమా రైట్స్ గురించి ట్రై చేసి ఈసినిమా రైట్స్ పొందలేకపోయిన కొందరు బయ్యర్లు ‘అజ్ఞాతవాసి’ పై నెగిటివ్ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో పవన్ సినిమాలకు విపరీతంగా పెరిగిన మ్యానియా నేపధ్యంలో ఇంచుమించు ‘బాహుబలి’ స్థాయిలో మన ఇరు రాష్ట్రాలతో పాటు ఓవర్స్ లో కూడా ఈమూవీకి బిజినెస్  జరిగింది అన్నది ఓపెన్ సీక్రెట్.  

 

దీనితో పవన్ మ్యానియా పై ఉన్న నమ్మకంతో ‘అజ్ఞాతవాసి’ సినిమాకు చాలమంది కొత్త డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు ఇచ్చి ఈసినిమా రైట్స్ తీసుకున్నారు. దీనితో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి స్టార్ట్ అవుతున్న కొత్త డిస్ట్రిబ్యూటర్లకు ఆరంగంలోని పాత  బ్యూటర్లకు విరోధం ఏర్పడి చాలమంది టాప్ హీరోల సినిమాల పై గాసిప్ లు స్ఫ్రెడ్ చేయించడం అన్నది ఒక అలవాటుగా మార్చుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు తమ పలుకుబడి, పరిచయాలు వాడి వీలైనంత వరకు తమకు డిస్ట్రిబ్యూషన్ అవకాశాలు రాని టాప్ హీరోల సినిమాలు కిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ  గాసిప్పులు గతకొంత కాలంగా వస్తూనే ఉన్నాయి.

 

ఇలాంటి పరిస్థితులలో ‘అజ్ఞాతవాసి’ ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీపడి ఆసినిమాను దక్కించుకోలేక పోయిన ఒక ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నిన్న సాయంత్రం నుండి తనకు బాగాపరిచియం ఉన్న మీడియా వర్గాలకు ఫోన్ చేస్తూ ‘అజ్ఞాతవాసి’ దుబాయ్ టాక్ అంటూ ‘అజ్ఞాతవాసి’ గురించి వీలైనంత డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘అజ్ఞాతవాసి’ హిట్ అవుతుందా ? ఫ్లాప్ అవుతుందా ?  అనే టెన్షన్ లో బయ్యర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: