టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ సినిమాల కన్నా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.  తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రతి విషయంపై స్పందిస్తూ..ఫేస్ బుక్, ట్విట్టర్ లో హాట్ హాట్ కామెంట్స్ పెడుతూ సంచలనం రేపుతున్నారు. ఇక పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై కామెంట్స్ చేస్తూ.. పవన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమా అయిన "పులి"ని చూసినట్టు ఉందని పేర్కొన్నాడు.
Image result for agnatavasi
కోరలు, పంజా లేని ఇలాంటి పులిని ఇప్పటివరకు చూడలేదని వ్యంగ్యంగా తెలిపాడు.  అంతే కాదు చారలు లేని పులిని ఇప్పుడే చూస్తున్నానని..దూకాల్సిన పులి పాకడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేసి మరో సంచలనానికి తెరలేపాడు. తాజాగా పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అయితే రామ్ గోపాల్ వర్మ ‘బహిరంగవాసి’ అని పోస్ట్ చేశారు.
Image result for agnatavasi
ఈ మద్య వర్మ కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు..ఏదైనా మెసేజ్ పెట్టాలంటే..వాటికి సంబంధించిన ఫోటోలు వ్యంగంగా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.  తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ చమత్కారపు ఫొటోని చూసిన వారంతా నవ్వుకుంటూ, పవన్‌పై కౌంటర్లేయడం మాత్రం వర్మ మానడు అంటే, ఏముంది కాపీయేగా.. ఈ టైటిల్‌తో వర్మ సినిమా చేసినా చేసేస్తాడు అంటూ నెటిజన్లు కూడా చమత్కారంగా రిప్లైలు ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: