‘జై లవ కుశ’ సినిమాలో కొంచం లావుగా కనిపించిన జూనియర్ త్వరలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం తన లుక్ లో మార్పులు చేసుకుంటున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఇప్పుడు తారక్ దాదాపు సగం తగ్గి పోయాడు అన్న వార్తలు వస్తున్నాయి.

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ నటించే సినిమాలో యంగ్ లవర్ బాయ్ గా కనిపించేందుకు వీలుగా తారక్ చేస్తున్న ప్రయతాలలో భాగంగా ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ సాయంతో జూనియర్ మొత్తం తన శరీరాకృతినే మార్చేసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లుక్ ను ప్రస్తుతం జూనియర్ సన్నిహితులు మాత్రమే చూడగలుగుతున్నారు.

 

తన లుక్ విషయం బయటకు రాకుండా జూనియర్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న నేపధ్యంలో జూనియర్ లేటెస్ట్ లుక్ ఫోటోలు త్రివిక్రమ్ మూవీ మొదలైతేకాని బయటకు రావు అని అంటున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ పరమ స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ రాత్రి ఎనిమిది అయ్యేసరికి రెస్ట్ తీసుకుంటున్నాడు అని టాక్. ఇక రోజంతా కసరత్తుల హడావిడి నడుస్తోంది అని అంటున్నారు.

 

దీనితో తారక్ ను కలవడానికి వెళ్లి చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో తారక్ తన కొత్త లుక్ ను ఎప్పుడు బయటపెడతాడు అన్న ఆతృత ఇందాత్స్రీ వర్గాలలో ఉంది. అయితే ‘అజ్ఞాతవాసి’ షాక్ నుంచి తేరుకుని త్రివిక్రమ్ సెట్ మీదకు రావాలి. ఆ సినిమా స్టార్ట్ కావాలి. అప్పటి వరకు తారక్ కు తన కొత్త లుక్ విషయంలో అజ్ఞాతవాసం తప్పదు అంటూ సెటైర్లు పడుతున్నాయి.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: