పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డదని చెప్పొచ్చు. త్రివిక్రం, పవన్ కాంబోలో ఇదవరకు వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాల మాదిరిగా ఈ అజ్ఞాతవాసి ఉంటుందని అనుకోగా అది కాస్త తుస్సు మనిపించింది.


అయితే సినిమాలో కథ ప్రకారం హీరో తండ్రి సమాజం మనుషుల మీద నమ్మకం లేక ఎప్పుడు ప్లాన్ బి వేస్తుంటాడు. ఆ రకంగానే ప్లాన్ బితో తన సొంత కొడుకుని అజ్ఞాతంలో ఉంచుతాడు. ఇక సినిమా రిజల్ట్ పవన్ ను నిరాశ పరచగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ బి ఏంటని అందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ ఈ సినిమాతో హిట్ కొట్టి కొద్ది గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్ మీద కాన్సెంట్రేట్ చేద్దామని అనుకుంటే అజ్ఞాతవాసి నిరాశ పరచింది.


మరి ఈ టైం లో పవన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నాడు. పవన్ ప్రవేశపెట్టే ప్లాన్ బి ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈమధ్యనే నీషన్ డైరక్షన్ లో మళ్లీ మరో రీమేక్ సినిమా చేస్తున్నాడని వార్తలు రాగా ఆల్రెడీ కాటమరాయుడు అలాంటి సబ్జెక్ట్టే కదా అని అంటున్నారు అభిమానులు. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండి మీద పవన్ కాస్త నిలకడ నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.


సాధారణంగా సినిమా సూపర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోని పవన్ ఈసారి అజ్ఞాతవాసి విషయంలో మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నాడన్నది టాక్. అందుకే తర్వాత సినిమా తీస్తే హిట్ అయ్యేలా ఉండాలని కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా బోయపాటి శ్రీనివాస్ కూడా పవన్ కోసం ఓ కథ సిద్ధం చేశాడని అంటున్నారు. అదే సినిమా సెట్ అయితే మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: