బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా..2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తర్వాత బాగా పాపులర్ అయ్యింది.  మోడలింగ్ చేస్తున్న ప్రియాంక తమిళన్ (2002) అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది.  ఆ తర్వాత అనీల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది.  అప్పటి నుంచి ఈ అమ్మడు వరుస విజయాలు అందుకుంటూ..అప్పడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తూ...బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. 
Related image
ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా  హాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా చోప్రా.  ప్రస్తుతం అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో-3 లో ప్రియాంకా చోప్రా నటిస్తుంది.  ఈ సినిమాలో చాలా బోల్డ్ గా ఉన్న సీన్లలో ప్రియాంక నటించినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.
Related image
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంకా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. క్వాంటికో-3 కోసం జరుగుతున్న షూటింగ్‌లో ప్రియాంకా చోప్రా తన కోస్టార్ అలన్ పావల్‌కు ఓ రొమాంటిక్ సీన్ లో లిప్ లాక్ ఇస్తూ గాఢమైన ప్రేమలో మునిగిపోతున్నట్లు కన్పిస్తున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో  ప్రియాంకా పోస్ట్ చేసింది.
Image result for priyanka chopra Quantico serial
ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  గతంలో కూడా పలు లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: