వివాదాస్పద చిత్రం 'పద్మావతి' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వకపోగా.. విడుదలైన అన్ని థియేటర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.  సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకొనె, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు కీలక పాత్రలు పోషించారు. 

పలు రాష్ట్రాల్లో రాజ్‌పుత్ కర్ణిసేన  హింసాత్మక నిరసనల మధ్యే ఈ చిత్రాన్ని విడుదల అయ్యింది.  చరిత్రను పూర్తిగా వక్రీకరించారని అంతే కాదు ముస్లిం రాజు  అల్లా ఉద్దీన్ ఖిల్జీని త‌ప్పుగా చూపించారంటూ అభ్యంత‌రాలు వ్యక్తం అవుతున్నాయి.  మ‌రోవైపు భార‌త్‌లో సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కర్ణిసేన‌లు విధ్వంసం సృష్టిస్తున్నారు.

స్కూల్ బ‌స్సును త‌గ‌ల‌బెట్ట‌డం, థియేట‌ర్ల‌ను, మాల్స్ ధ్వంసం చేయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. ఇక పద్మావత్ చిత్రం  షూటింగ్ మొదలైన దగ్గర నుంచి వివాదం. దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీని కొట్టారు. సెట్‌ను, షూటింగ్ సామగ్రిని తగలబెట్టారు. సినిమా విడుదల చేస్తే చంపేస్తామన్నారు. కానీ భన్సాలీ ఎంతో కష్టపడి సినిమాను పూర్తిచేశారు.‘పద్మావతి’ కావ్యాన్ని ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధం చేశారు. 
Image result for karni sena
 ఈ చిత్రం విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు...శాంతి భద్రతల పరిస్థితి చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టంచేసింది. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీ వయాకాం 10 మోషన్ పిక్చర్స్ ఓ డైలాగ్ ప్రొమోను విడుదల చేసింది. 

Image result for karni sena

నేడు దేశ వ్యాప్తంగా ‘పద్మావత్’ విడుదలైనప్పటికీ నాలుగు రాష్ట్రాల్లో ఒక్క షో కూడా పడలేదు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లోని థియేటర్ యజమానులు వణికిపోతున్నారు. తాము సినిమాను ప్రదర్శించలేమని తేల్చి చెప్పేశారు. విధ్వంసాలను అడ్డుకోలేని పోలీసులు ఇప్పుడు థియేటర్లకు ధైర్యం చెబుతున్న ఫలితంలేదు. పోలీసుల బందోబస్తు ఉన్నా తాము ధైర్యం చేయలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: