ఒకప్పుడు మళియాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే ముచ్చెమటలు పట్టించిన శృంగార తార షకీలా.  90వ దశకంలో షకీలా సినిమా వచ్చిందీ అంటే..చాలు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి అగ్ర హీరోల సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునేవారట.  ఏది ఏమైనా..షకీలా తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించినా..జీవితంలో మాత్రం ఎన్నో వొడిదుడుకులు ఎదుర్కొందని పలు సందర్భాల్లో తెలిపింది. 
Image result for hot actress shakila
తాజాగా షకీలా ‘శీలవతి’ నంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. WHAT THE F*** అనేది ఉపశీర్షిక. జీ స్టూడియోస్‌ పతాకంపై మలయాళ స్టార్‌ షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శీలవతి'.  ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''మా హీరోయిన్‌ షకీలాకు ఇది 250వ చిత్రం.
Related image
కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. మా నిర్మాతలు గణేష్‌, వీరబాబు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాము. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్‌ క్రిష్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుందని అన్నారు.సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్‌ క్రిష్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: