మాటల మాంత్రికుడుగా రచయితగా పేరుగాంచిన త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తో ఎంత అభద్రతాభావంతో ఉంటున్నాడో చెప్పడానికి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది మాటల రచయితగా ఎంతో పేరు గాంచిన త్రివిక్రమ్ కథా రచయితగా పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు ఈ న్యూస్ వల్ల అనిపిస్తోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి.

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

‘అ ఆ’ ‘అజ్ఞాతవాసి’ సినిమాలకు వేరే వాళ్ల కథలతో అనుసరణ చేసి అవమానాన్ని మూట  కట్టుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోతున్న సినిమాకు సంబంధించి ఏకంగా రెండు ననలలు కొనట్లు వార్తలు వస్తునాయి. వాటిలో ఒకటి యద్దనపూడి సులోచనారాణి నవల అయితే మరొకటి షాడో పాత్ర సృష్టికర్త ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు నవల అని తెలుస్తోంది. మధుబాబు రాసిన ఒక మాంచి నవలలోని పాయింట్ నచ్చి ఆ నవల హక్కులను కూడ  త్రివిక్రమ్ కొన్నట్లు తెలుస్తోంది. 

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు ఆ రెండు నవలల ఆధారంగా ఫ్యామిలీ సెంటిమెంట్ నేపధ్యంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ తీయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన అని అంటున్నారు. అయితే కొన్న ఆ నవలల పేర్లేమిటి ? అన్న విషయాన్ని జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ నిర్మాణం పూర్తి అయ్యే వరకు చాలా రహస్యంగా ఉంచ బోతున్నారని టాక్.

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో ఈరెండు నవలలకు త్రివిక్రమ్ మార్క్ పంధాలో మార్పులుచేర్పులు చేయడానికి త్రివిక్రమ్ తన పాట  రైటర్స్ టీమ్ స్థానంలో ఒక కొత్త రైటర్స్ టీమ్ ను  ఏర్పాటు చేకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘అజ్ఞాతవాసి’ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో  త్రివిక్రమ్ గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా ఉండేందుకు చాలా జగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. అయితే  ఈ నవలలను  జూనియర్ సినిమాకోసం కధగా మార్చినప్పుడు కధకుసంబంధించి  మధుబాబుకి యద్దనపూడికి టైటిల్ కార్డ్స్ లో క్రెడిట్ ఇస్తారా ? లేదా అన్న విషయం పై భినాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: