టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత... తాజాగా సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడుపుతోంది. పెళ్లికి ముందు ఎలా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొందో అదే తరహాలో.. పెళ్లికి తర్వాత కూడా సమంత చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తోంది.  తాజాగా ''రంగస్థలం'' చిత్రంలో చెర్రీకి జోడీగా సమంత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. సమంత చేతికి కట్టు కట్టుకుని వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత చేతికి కాస్త నొప్పిగా ఉన్నా షూట్‌లో పాల్గొన్నారట.
Image result for rangasthalam samantha
అంత బాధపడుతూ షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే... సినిమాలో ఎంతో కీలకమైన సీన్స్‌ అవి. సమంత ఉండాల్సిందే. బహుశా తన వల్ల చిత్రబృందానికి ఇబ్బంది కలగకూడదని ఆమె ఆలోచించారేమో. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎర్నేని నవీన్, మోహన్‌ చెరుకూరి, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న సినిమా ‘రంగస్థలం’.   

కొన్ని కీలకమైన సీన్స్ తో పాటు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ అంతా చాలా టైట్ గా కొనసాగింది.  ఈ నేపథ్యంలో, హెవీ వర్క్ వల్ల సమంతకు చేయి నొప్పి అనిపించిందట. అందుకే రిలీఫ్ కోసం ఆమె చేతికి కట్టు కట్టించుకుంది. దీనిపై సమంత కూడా స్పందించింది. 'చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. దీనికి నా చెయ్యే నిదర్శనం'  అని ఆమె తెలిపింది.
Image result for rangasthalam samantha
ఏది ఏమైనా  సమంతకు డెడికేషన్‌ ఎక్కువ అంటున్నారు ఇండస్ట్రీ వర్గం.  ‘రంగస్థలం’లో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు క్యారెక్టర్‌లో రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మూగమ్మాయి మహాలక్ష్మీ క్యారెక్టర్‌లో సమంత కనిపించనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయాలనుకుంటున్నారు.  ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న సమంతకు ఓ రోజు హెవీ వర్క్‌ వల్ల కాస్త చెయ్యి నొప్పి అనిపించిందట. అందుకనే ఆమె కట్టు కట్టించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: