ఈ మద్య కొంత మంది కామాంధులు ఎవ్వరినీ వదలడం లేదు. లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. ఆ మద్య మళియాళ బ్యూటీ భావనను ఆమె కారు డ్రైవర్ మరో స్నేహితుడు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే నటి భావన మాత్రం ఈ విషయాన్ని అంతటితో వదిలివేయకుండా పెద్ద రాద్దాంతం చేసింది..ఆమెకు మద్దతుగా అన్ని ఇండస్ట్రీలు నిలబడ్డాయి.  మొత్తానికి తనను లైంగికంగా వేధించిన ఆ డ్రైవర్ ని అతనిని పురమాయించిన మరో సినీ నటుడికి జైలు శిక్ష పడేలా చేసింది. 
 పోలీసులు ఏమన్నారు..:
అయితే భావన తెగువ చూసి మరికొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పెదవి విప్పారు. ఈ మద్య  అమలాపాల్ విషయంలో ఇదే జరిగింది. డ్యాన్స్ స్కూల్లో రిహార్సల్స్ చేస్తున్న ఓ సమయంలో ఓ ప్రబుద్దుడు ఆమె పట్ల అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో మళియాళ నటి పై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు ఓ వ్యక్తి . మళియాళ నటి సనూష రైల్లో ప్రయాణిస్తుండగా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అమ్మడు పవన్ కళ్యాన్ నటించిన ‘బంగారం’ చిత్రంలో మీరా చోప్రా చెల్లెలిగా నటించింది. 
 చాలా బాధనిపించింది:
కున్నూర్‌ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్‌ అనే వ్యక్తి నిద్రిస్తున్న తనపై లైంగిక వేధిపులకు పాల్పడినట్లు సనూషా తెలిపారు.త్రిసూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 'నేను నా బెర్త్ పై పడుకుని ఉన్న సమయంలో.. ఎవరో నా పెదాల్ని తాకినట్లుగా అనిపించింది.
 సనూషాకి లైంగిక వేధింపులు:
తలతిప్పి చూసేసరికి.. ముందు బెర్త్ లో ఉన్న వ్యక్తి అసభ్యంగా తన పెదాల్ని తాకుతున్నట్లు అర్థమైంది. వెంటనే రైల్లో లైట్ ఆన్ చేసి.. అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను ' అని సనూషా చెప్పారు.సంఘటన జరిగిన సమయంలో.. కేవలం ఇద్దరు వ్యక్తులు, రచయిత ఉన్ని మాత్రమే తనకు అండగా నిలబడ్డారని, చాలామంది మహిళలు నేను అరుస్తున్నా పట్టించుకోలేదని అన్నారు. సంఘటన జరిగిన చోట ఎవరి నుంచి స్పందన ఉండటం లేదని సనూషా ఆవేదన వ్యక్తం చేశారు.
 అక్కడ అసభ్యంగా తాకి..:
ఈ కేసులో చట్టబద్దంగా ఎలా వ్యవహరించాలో తనకు తెలుసు అని, తన ఫ్యామిలీ అంతా తనకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సనూషా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించారు.  నిందితుడు(40) తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును త్రిసూర్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అటాచ్ చేస్తున్నట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: