గతవారం విడుదలైన నాగ శౌర్య ‘ఛలో’ సినిమాకు నెమ్మదిగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో నిన్నటి వీకెండ్ వరకు ఈమూవీ కలక్షన్స్ బాగానే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈసినిమా కలక్షన్స్ కు సంబంధించి అసలు పరీక్ష ఈరోజు మొదలవుతుంది. ఇది ఇలా ఉండగా నాగ శౌర్యను మెగా అభిమానులు తమ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

NAGA SOURYA IN CHALO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

మెగా కుటుంబంలో సుమారు పదిమంది హీరోలు ఉన్నప్పటికీ మెగా అభిమానులు నాగ శౌర్యతో కనెక్ట్ అవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘ఛలో’ సినిమాను ఒక మెగా యంగ్ హీరో నటించిన సినిమాగా భావిస్తూ ఆ సినిమాకు మెగా అభిమానులు ఆమూవీ పై చేతనైనంత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఈమూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు.

 NAGA SOURYA IN CHALO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇలా మెగా అభిమానులు నాగ సౌర్య పై తమ ప్రేమ వ్యక్త పరచడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ‘ఛలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి అతిధిగా వచ్చినప్పుడు మెగా స్టార్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ నాగ శౌర్య చేసన పొగడ్తల భజన ఒక కారణం అయితే ఎప్పటికైనా మెగా డాటర్ నిహారిక నాగ శౌర్య పెళ్లి చేసుకుంటారు అని వస్తున్న గాసిప్పులు మరొక కారణం అని అంటున్నారు.

 సంబంధిత చిత్రం

దీనికితోడు ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఏ సినిమాలను ఎటువంటి హాస్యం లేకపోవడంతో టాప్ హీరోల రకరకాల ప్రయోగాలు చూసిన తరువాత విసుగుచెందినపోయిన ప్రేక్షకులకు నాగ శౌర్య ‘చలో’ లోని హాస్యం ఒక రిలీఫ్ ను ఇచ్చింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. కారణాలు ఏమైనా అనుకోకుండా లభించిన మెగా అభిమానుల సపోర్ట్ తో పాటు సగటు ప్రేక్షకుడి పాజిటివ్ టాక్ కూడ తోడవ్వడంతో ‘ఛలో’ ఒక మంచి హిట్ మూవీగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: