వరుణ్ తేజ్, రాశి ఖన్నా ,సినిమాటోగ్రఫీ ,మ్యూజిక్ ,ఫస్ట్ హాఫ్వరుణ్ తేజ్, రాశి ఖన్నా ,సినిమాటోగ్రఫీ ,మ్యూజిక్ ,ఫస్ట్ హాఫ్క్లైమాక్స్ , సెకండ్ హాఫ్
లండన్ లో ఉంటున్న ఆదిత్య (వరుణ్ తేజ్) తన ఫెయిల్యూర్ లవ్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ప్లస్ 2 టైంలో ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు ఆదిత్య. ఆ తర్వాత ఇద్దరు సేం కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఆదిత్య లవ్ ప్రపోజల్స్ కు ఓకే చెప్పేస్తుంది వర్ష. ఇంతలోనే ఇద్దరు పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ 6 ఏళ్ల తర్వాత కలుస్తారు.. అప్పుడు మళ్లీ ఇద్దరు ప్రేమించుకుంటారు.. ఇంతకీ వర్ష, ఆదిత్య లవ్ యాక్సెప్ట్ చేసిందా..? వారిద్దరు ఎందుకు విడిపోతారు..? అన్నది సినిమా కథ.
ఫిదా లాంటి సూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత వరుణ్ తేజ్ తొలిప్రేమలో లవర్ బోయ్ గా కొత్తగా కనిపిస్తాడు. పెయిన్ ఫుల్ క్యారక్టర్ లో బాగా మెప్పించాడు. వర్ష పాత్రలో రాశి ఖన్నా కూడా ఇంప్రెస్ చేసింది. కచ్చితంగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. సప్నా పబ్బి చిన్న రోల్ అయినా ఆకట్టుకుంది. ప్రియదర్శి కామెడీ అలరించింది. జబర్దస్త్ ఆది మెప్పించాడు. సుహాసిని పాత్ర కూడా అలరించింది.

వెంకీ అట్లూరి కథ కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. తొలిప్రేమ లాంటి టైటిల్ కు ఎలాంటి కథ అవసరమో అదే కథతో వచ్చాడు. కథ పాతదే అనిపించినా కథనంలో ఫీల్ బాగా వర్క్ అవుట్ చేశాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఫారిన్ లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. తమన్ మ్యూజిక్ కూడా కొత్తగా ఉంటుంది. ఎడిటింగ్ ఒకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తొలిప్రేమ టైటిల్ తో వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. టైటిల్ కు జస్టిఫికేషన్ చేసేలా ఈ సినిమా కథ ఉంటుంది. వరుణ్ తేజ్, రాశి ల లవ్ ఎమోషనల్ సీన్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఫిదా తర్వాత పూర్తి డిఫరెంట్ పాత్రలో వరుణ్ కనిపించాడు.

మొదటి భాగం ఫీల్ గుడ్ తో కంటిన్యూ చేయగా.. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా అంతగా ఇంప్రెస్ చేయదు. కథ కథనాల్లో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినదిగా ఉన్నా ఇలాంటి కథలు చాలా వచ్చాయన్న భావన వస్తుంది. అయితే కథనం కొత్తగా అనిపిస్తుంది. సినిమా చాలా భాగం ఫారిన్ లోనే కాబట్టి ప్రెజెంటేషన్ బాగా అనిపిస్తుంది.

ఫీల్ గుడ్ మూవీస్ కు ప్రాణమైన క్లైమాక్స్ ఈ సినిమాకు కాస్త వీక్ అయినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ లో లీడ్ పెయిర్ మంచి మార్కులు కొట్టేశారు. మొత్తానికి యూత్ నచ్చేలా తొలిప్రేమ టైటిల్ కు మంచి జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు. 
Varun Tej,Raashi Khanna,Venky Atluri,BVSN Prasad,Thaman SSమనసులను తాకే 'తొలిప్రేమ'..!

మరింత సమాచారం తెలుసుకోండి: