యువ హీరో నాగ శౌర్య ఛలో హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ ఛలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. పోటీగా వచ్చిన రవితేజ టచ్ చేసి చూడు డీలా పడటంతో ఛలో సినిమాకు అందరు చలో అంటున్నారు. ఇక ఈ సినిమా మొదటి నుండి కాన్ఫిడెంట్ గా ఉన్న చిత్రయూనిట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ రిలీజ్ పడే సరికి హిట్ అందుకున్నారు.


ఈ సినిమా ముందు 2017 డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని అప్పుడు పోటీగా చాలా సినిమాలు ఉండటంతో రిలీజ్ వాయిదా వేశారు. సంక్రాంతి బరిలో సినిమాల హంగామా ఉండటంతో ఫిబ్రవరి 2న కూల్ గా వచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుండి సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక పేరు మారుమోగుతుంది.


ఏకంగా ఎన్.టి.ఆర్, తారక్ సినిమాలోనే ఛాన్స్ పట్టేసింది అంటే అమ్మడి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి వారాంతరంలో 5 కోట్ల పైగా వసూళ్లను రాబట్టిందట. 6 కోట్ల బడ్జెట్ మరో 3 కోట్ల ప్రమోషన్స్ మొత్తం 9 కోట్లతో సినిమా పూర్తి చేసి 10 కోట్ల బిజినెస్ చేసిన ఛలో కొన్ని ఏరియాల్లో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేశారు.


ఇక సినిమా కలక్షన్స్ చూస్తుంటే వారంలో మొత్తం రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ను లాభాల పట్టేలా చేస్తుంది. సినిమాకు మ్యూజిక్ అందించిన సాగర్ స్వర మహతి మంచి మార్కులే కొట్టేశాడు. మణిశర్మ తనయుడిగా తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సాగర్ మహతి తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాతో యువ హీరోగా నాగ శౌర్య రేంజ్ మరింత పెరిగిందని చెప్పాలి.


ఇక నాగ శౌర్య ఇదవరకు సినిమాల గురించి కొన్ని గాసిప్పులు వినిపించాయి. డైరక్టర్స్ ను ఇబ్బంది పెడతాడని.. వారి పనిలో వేలుపెడతాడని వార్తలు గట్టిగానే వచ్చాయి. ఆ క్రమంలోనే రెండు, మూడు క్రేజీ సినిమాలు మిస్ అయ్యాడని అన్నారు. ఫైనల్ గా వారందరికి సమాధనం చెప్పేలా నాగ శౌర్య ఈ సినిమా తీశాడు. కథ కథనాలే కాదు నిర్మాణంలో భాగమై తన కాన్ఫిడెన్స్ ఏంటో నిరూపించుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: