సినిమాటోగ్రఫీ, కాస్టింగ్, బి.జి.ఎంసినిమాటోగ్రఫీ, కాస్టింగ్, బి.జి.ఎంరొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ నరేషన్
సూరజ్ (సందీప్ కిషన్), నిత్యా (అమైరా దస్తర్) ఇద్దరు చిన్ననాటి నుండి మంచి ఫ్రెండ్స్. వారు కుటుంబాలు కూడా కలిసి మెలిసి ఉండటంతో ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని డిసైడ్ చేస్తారు. కాని ఇంతలో ఈ పెళ్లి ఇష్టం లేని నిత్యా ఇంట్లోంచి వెళ్లిపోతుంది. నిత్యాతో పాటు సూరజ్ కూడా గోవా వెళ్తాడు. అక్కడ పరిస్థితుల కారణంగా ప్రకృతిని చూసి తన నిర్ణయాలను మార్చుకుంటుంది నిత్య. సూరజ్ కూడా అక్కడ నిక్కి (త్రిధా చౌదరి)ని ఇష్టపడతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ అతనితో పెళ్లి వద్దు అనుకున్న నిత్య మళ్లీ సూరజ్ ను ఇష్టపడుతుంది. ఇంతకీ సూరజ్ నిత్యను ఇష్టపడ్డాడా.. నిక్కిని ఇష్టపడ్డాడా..? నిత్యకి దేని వల్ల సూరజ్ పై ప్రేమ పెరిగింది..? అసలు ఈ కథకు ముగింపు ఎలా దొరికింది అన్నది సినిమా కథ.
సందీప్ కిషన్ ఎప్పటిలానే జోవియల్ రోల్ లో అలరించాడు. అయితే ఈ సినిమాలో లుక్స్ పరంగా ఇంప్రెస్ చేశాడు. అమైరా దస్తర్ కూడా ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో తన నటన బాగుంది. త్రిధా చౌదరి బాగానే చేసింది. అమ్మడి గ్లామర్ షో హుశారెత్తిస్తుంది. ప్రియదర్శి సినిమా మొత్తం ఉన్నా సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. సినిమాలో మంజుల తనయురాలు జాన్వి కూడా నటించి మెప్పించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
రవి యాదవ్ సినిమాటోగ్రఫీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. సినిమాకు మంచి లుక్ అందించారు. ఎడిటింగ్ మొదటి భాగం కాస్త ట్రిం చేయాల్సింది. కథ, కథనాలు రొటీన్ గా సాగినట్టు అనిపించినా ఆకట్టున్నాయి.మంజుల డైరక్షన్ కు మంచి మార్కులే పడతాయి. అయితే కథ కథనాల మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
హీరో, హీరోయిన్ చిన్నప్పటి నుండి ఇద్దరి ఫ్యామిలీతో కలిసి ఉండటంతో వారి స్నేహాన్ని ప్రేమ అనుకుని పెళ్లి చేయాలనుకోవడం వరకు చాలా సినిమాల్లో చూశాం. అయితే ఇక్కడ వారు పెళ్లిని కాదని ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం నువ్వు లేక నేను లేను సినిమా కాన్సెప్ట్ లా అనిపిస్తుంది. 


అయితే ఇందులో ప్రకృతిని వాడుకుని హీరోయిన్ తన ప్రేమను గుర్తించడం జరుగుతుంది. కథ, కథనాలు రొటీన్ గా అనిపిస్తాయి. లైన్ బాగుంది అనిపించినా కథనంలో తేలగొట్టేశారు. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక సినిమా అంతా రొటీన్ గానే నడుస్తుంది. మంజుల మొదటి సినిమా అన్న భావన కొన్ని సీన్స్ లో ఇట్టే తెలిసిపోతుంది.


ప్రతిది డీటైల్డ్ గా చెప్పే క్రమంలో ఆడియెన్స్ కు బోర్ కొడుతుంది అన్న పాయింట్ మర్చిపోయారు. మొదటి భాగం కాస్త ట్రిం చేసుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫైనల్ గా సినిమా యువతకు నచ్చడం అనేది కూడా అటు ఇటుగా ఉంటుంది.
Sundeep Kishan,Amyra Dastur,Tridha Choudhury,Manjula Ghattamaneni,P Kiran (Gemini Kiran) & Sanjay Swarup,Radhanమంజుల మనసుకి నచ్చింది.. మంచి ప్రయత్నమే కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: