టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒక‌రైన దిల్ రాజు అటు నిర్మాత‌గాను, ఇటు పంపిణీదారుడిగాను దూసుకుపోతున్నారు. అయితే గ‌త కొద్ది రోజులుగా నిర్మాత‌గా స‌క్సెస్ అవుతున్న రాజు, పంపిణీదారుడిగా మాత్రం పెద్ద ఎదురు దెబ్బ‌లే తింటున్నాడు. స్పైడ‌ర్‌, అజ్ఞాత‌వాసి లాంటి సినిమాలు రాజును దారుణంగా దెబ్బ‌తీశాయి. ఇక రాజా ది గ్రేట్ స‌క్సెస్‌తో కాస్త కోలుకున్న రాజు ఈ యేడాది వ‌రుణ్‌తేజ్ హీరోగా వ‌చ్చిన తొలిప్రేమ సినిమాను పంపిణీ చేసి భారీ లాభాల దిశ‌గా వెళుతున్నాడు.

Image result for varun tej toli prema

2017లో నిర్మాత‌గా ఆరు సినిమాలు నిర్మించి, ఆరు సినిమాల‌తో లాభాలు మూట‌క‌ట్టుకున్న రాజు ఆ డ‌బ్బంతా పంపిణీ చేసిన సినిమాల‌తో పోగొట్టేసుకున్నాడు. ఇక తాజాగా వ‌చ్చిన తొలిప్రేమ మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను రాజు సొంతం చేసుకున్నాడు. తొలిప్రేమను నిర్మించింది బివిఎస్ఏన్ ప్రసాద్ గారే అయినప్పటికీ దిల్ రాజు కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకున్నాడు.

Image result for varun tej toli prema

ఇక రూ.18 కోట్ల‌కు ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకుంటే ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌వుతోంది. సినిమాకు ఏ సెంట‌ర్ల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల‌లో లాంగ్ ర‌న్ ఉండే ఛాన్సులు ఉండ‌డంతో సినిమాకు లాభాలు మంచిగానే వ‌స్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తన అసలు వచ్చేశాక నిర్మాతకు 50% షేర్స్ ఇవ్వాలి.. తక్కినదంతా రాజుగారికే. ఏదేమైనా తొలిప్రేమ‌తో మ‌రీ భారీ లాభం అని చెప్ప‌లేం కాని...రాజు ఖాతాలో లాభాలు అయితే ప‌డ‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: