తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న హీరో నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ బ్యానర్ ఫై అ!. అనే సినిమాను నిర్మించాడు. గతం లో ఎన్నడూ లేని విధంగా చిత్ర ప్రమోషన్ చేయడం తో సినిమా ఫై భారీ అంచనాలు పెరిగాయి.  ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచారు.  ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ రాని కొత్త కథ గా రూపొందించామని..ఇది తిక్క తిక్కగా ఉంటుందని ఆ మద్య నాని కామెంట్ చేశాడు.  ఈ సినిమాలో అందరూ టాప్ హీరోయిన్లు నటించడం మరో విశేషం. 
Image result for awe movie stills
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాగుందని , చాల డిఫరెంట్ గా ఉందని , నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ అందరు కూడా చాల బాగా నటించారని , చెట్ల వల్ల మనకు కలిగే ఉపయోగాలు తదితర అంశాలను సినిమాలో ప్రధాన అంశాలుగా చూపించారని చెపుతున్నారు.
Image result for awe movie stills
ముఖ్యంగా బోన్సాయి చెట్టుకు వాయిస్ ఓవర్ చెప్పిన రవితేజ నవ్విస్తూనే మొక్కల ప్రాధాన్యతను వివరించిన తీరు బాగుందని తెలుపుతున్నారు.  ఓవర్సీస్ లో ఇండియా లో కంటే ముందే ప్రీమియర్స్ పడ్డాయి.  ప్రీమియమ్ షో టాక్ ప్రకారం సినిమాల ఆద్యంతం ఉత్కంఠంగా సాగుతూనే కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడట.
Image result for awe movie stills
ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు, సెకండ్ హాఫ్‌లో అసలు కథలోకి వెళ్లాడట. సినిమా నిడివి కూడా తక్కువ కావడం ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా జాగ్రత్త పడ్డారట. ఇలాంటి సినిమా బి, సి సెంటర్లలో ఆడటం కష్టమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి మన దగ్గర టాక్ ఎలా వస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: